Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో చిరు - మహేష్ తర్వాత విజయ్ దేవరకొండనే..!

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:00 PM IST
టాలీవుడ్ లో చిరు - మహేష్ తర్వాత విజయ్ దేవరకొండనే..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. సినిమాలతోనే కాకుండా తన స్టైలింగ్ - డిఫరెంట్ యాటిట్యూడ్ తో యూత్ లో ఎనలేని ఫాాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఓవైపు సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు యాడ్స్ రూపంలో సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. ఇప్పుడు విజయ్ క్రేజ్ కు నిదర్శనంగా ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.

ప్రముఖ శీతలపానీయం కంపెనీ 'థమ్స్ అప్' కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. తాజాగా ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఈ ఇద్దరు పాపులర్ స్టార్స్ తర్వాత టాలీవుడ్ నుంచి విజయ్ కు మాత్రమే ఈ అవకాశం దక్కింది. స్వతహాగా మహేష్ వీరాభిమాని అయిన వీడీ.. ఇప్పుడు ఆయన తర్వాత కోకా కోలా సంస్థకు చెందిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కు ప్రచారకర్తగా నియమించబడటం గమనార్హం.

విజయ్ దేవరకొండను థమ్స్ అప్ కు న్యూ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం మార్కెట్ పరంగా అతని క్రేజ్ కు నిదర్శనంగా భావించవచ్చు. రౌడీ స్టార్ బ్రాండింగ్ చేస్తుండటంతో తమ ప్రాడక్ట్ మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని కూల్ డ్రింక్ కంపెనీ నమ్ముతోంది. ఇకపోతే సోమవారం VD తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తుఫాన్ అని జత చేస్తూ.. థమ్స్ అప్ ప్రకటనకు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు.

థమ్స్ అప్ కు విజయ్ బ్రాండింగ్ చేస్తున్నారనే ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 'తూఫాన్' 'రౌడీ ఫర్ థండర్' వంటి హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. విజయ్ తో షూట్ చేసిన యాడ్ మంగళవారం నుండి అఫీషియల్ గా సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కాబోతుంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. 2022 ఆగస్ట్ 25న తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదే క్రమంలో సుకుమార్ తో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు.