Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి పార్టీ ఇచ్చిండే!!

By:  Tupaki Desk   |   11 Sept 2017 3:30 PM IST
అర్జున్ రెడ్డి పార్టీ ఇచ్చిండే!!
X
ఈ ఇయర్ టాలీవుడ్ కి బెస్ట్ ఇయర్ గా చెప్పుకోవాలి. భారీ బడ్జెట్ విజువల్స్ వండర్ ని అందించిన బాహుబలి చిత్రం తో పాటు ప్రేక్షకులు ఎన్నడు చూడని బోల్డ్ కంటెంట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి లాంటి సినిమాను కూడా తెలుగు జనాలు ఆదరించారు. అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ కరెక్ట్ గా కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు సినిమాని బాక్స్ ఆఫీస్ లిస్ట్ లో ఒకటీగా చేర్చారు.

కేవలం 6 కోట్లకు థ్రియేటికల్ అమ్ముడుపోగా సినిమా మొత్తం 41.4 కోట్ల గ్రాస్ ను అందించి 22.6 షేర్స్ ని అంధించింది. ఇక పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమా ఎనిమిది రేట్లు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ఇంతటి విజయాన్ని అందుకుంది గనక చిత్ర యూనిట్ కి హీరో విజయ్ దేవరకొండ మంచి పార్టీని ఇచ్చాడట. శనివారం ఒక స్టార్ పబ్ లో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి విజయ్ హ్యాపీ గా సెలబ్రెట్ చేసుకున్నాడట. ప్రస్తుతం విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుందంటే ముఖ్య కారణం కూడా అతడనే.

ఎందుకంటే నటనలోనే కాకుండా స్టార్ హీరోలు సైతం వారి సినిమాకి చేసుకోలేని ప్రమోషన్ ను విజయ్ ఊహించని స్థాయిలో చేశాడు. కేవలం తన మాటలతోనే ఈ కుర్ర హీరో అభిమానులను ఆకట్టుకొని తన సినిమాను సక్సెస్ చేసుకోవడమే కాకుండా చిత్ర యూనిట్ కి కూడా మంచి విజయాన్ని అందించాడు.