Begin typing your search above and press return to search.
VD టార్గెట్ పాన్ ఇండియా..!
By: Tupaki Desk | 27 Aug 2021 8:00 AM ISTటాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాతో సోలో హీరోగా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్.. సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో VD ఇప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వీడీ కి ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాణంలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని విజయ్ నమ్మకంగా ఉన్నాడు.
అందుకే విజయ్ దేవరకొండ ఇకపై పాన్ ఇండియన్ సినిమాలపైనే దృష్టి పెట్టనున్నాడని తెలుస్తోంది. కేవలం తెలుగుకే పరిమితమయ్యే కథలకు కాకుండా.. పాన్ ఇండియా అప్పీల్ ఉండే స్క్రిప్ట్స్ ని యువ హీరో ఎంపిక చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ మల్టీలాంగ్వేజ్ మూవీ అనౌన్స్ చేసాడు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ శెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
అలానే 'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణ తో విజయ్ దేవరకొండ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇది తెలుగు నేటివిటికి తగ్గట్లుగా ఉండే ఓ అందమైన ప్రేమ కథ అని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 'లైగర్' తర్వాత పాన్ ఇండియా కథలను చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వీడీ.. ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని చూస్తున్నాడట.
ఈ నేపథ్యంలో శివ నిర్వాణ ను ఓ పాన్ ఇండియా స్క్రిప్ట్ ఉంటే చెప్పమని విజయ్ కోరాడట. అలాంటి కథ కుదిరితే డేట్స్ కేటాయించడానికి రెడీగా ఉన్నారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. వీడీ ప్లాన్స్ అన్నీ ఇప్పుడు టార్గెట్ పాన్ ఇండియా అనే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు తమ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో VD కూడా నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు.
'లైగర్' సినిమాతో ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్లాప్ తర్వాత ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. అలానే సుకుమార్ సినిమా కంటే ముందే మరో ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న యంగ్ హీరో.. మరికొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇకపోతే 'లైగర్' సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తయ్యింది. సెప్టెంబర్ లో తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ కంప్లీట్ అయిన తర్వాత సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ గా కనిపించనున్నారు. దీని కోసం శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇందులో VD హావభావాలు - లుక్ - డైలాగ్ డెలివరీ సరికొత్తగా ఉండబోతున్నాయి.
'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో ఇప్పటికే విడుదలైన 'లైగర్' ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరీ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.