Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో క్లోజ్ గా ఉంటూనే రౌడీ రేసింగ్
By: Tupaki Desk | 2 Oct 2020 8:00 AM ISTఆ ఇద్దరు స్టార్ హీరోలకు అభిమాన హీరో మన యంగ్ రౌడీ. అతడి సినిమాలకు ప్రచారం చేసి పెడుతూ ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కానీ ఆ ఇద్దరి మెప్పు పొందుతూనే ఆ ఇద్దరినీ క్రాస్ చేసేందుకు చెక్ పెట్టేందుకు రౌడీ దేవరకొండ రెడీ అవుతుండడమే ఇక్కడ ట్విస్టు. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు? అంటే.. ఒకరు మహేష్.. ఇంకొకరు బన్ని.
ఇకపోతే మహేష్ వర్సెస్ బన్ని ఎపిసోడ్స్ గురించి తెలిసినదే. మహేశ్ బాబుని బన్నీ టార్గెట్ చేస్తే.. బన్నీని ఇపుడు విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తున్నాడా...! అంటే.. అవుననే అనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా అలవైకుంఠపురం సినిమాను దింపి.. ఆ రేస్ లో విన్నర్ గా నిలిచి బన్నీ తన స్టామినా ఏంటో అందరితో పాటు మహేశ్ బాబుకి రుచి చూపించాడు. అయితే మహేశ్ బాబుతో బన్నీకి ఈ బాక్సాఫీస్ వార్ ఎప్పటినుంచో నడుస్తోంది. ఈ తరహా పోటీలో మహేశ్ ఎక్కువ సార్లు నిలిచినా ఈసారి విక్టరీతో బన్నీకి వచ్చినంత క్రేజ్ గతంలో మహేశ్ కి రాలేదు. కానీ ఇప్పటికీ మహేశ్ దే పై చేయి.
ఇక అటు బన్నీతో అటు మహేశ్ తో సన్నిహితంగా ఉంటూ విజయ్ దేవరకొండ వీరిద్దరికి పోటీ ఇవ్వడానికి పెద్ద ప్లాన్స్ వేస్తున్నాడు. ముందుగా సోషల్ మీడియాలో వీరిని టార్గెట్ చేసి రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. బన్నీకి ఇన్ స్టాగ్రామ్ లో 80 లక్షలు ఫాలోవర్స్ ఉంటే ఈ రికార్డుని బ్రేక్ చేస్తూ తాజాగా విజయ్ దేవరకొండ 90 లక్షల మంది ఫాలో వర్స్ ని తెచ్చుకోవడమే కాకుండా హిందీ బెల్టులో కూడా తనకి విపరీతమైన క్రేజ్ ఉందని ప్రచారం చేయిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్లు గా వెలగాలని తాపత్రాయ పడుతున్న మహేష్.. బన్ని ఇద్దరితో రౌడీ పోటీపడుతున్న తీరు చూస్తుంటే షాకిస్తోంది. ప్రభాస్ తర్వాత రౌడీయేనా? అన్న తీరుగా విజయ్ దేవరకొండ దూసుకుపోతుండడం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.