Begin typing your search above and press return to search.

మీలాంటి ఆడియన్స్‌ దేశంలో ఎక్కడ లేరుః దేవరకొండ

By:  Tupaki Desk   |   8 March 2021 3:32 AM GMT
మీలాంటి ఆడియన్స్‌ దేశంలో ఎక్కడ లేరుః దేవరకొండ
X
నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో నాగ్ అశ్విన్‌ నిర్మించిన జాతి రత్నాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా వరంగల్‌ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్‌ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. విజయ్‌ దేవరకొండ రాకతో కాకతీయ డిగ్రీ కాలేజ్ మైదానం కిక్కిరిసి పోయింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేశాడు. వచ్చిన జనాలను చూసి విజయ్‌ దేవరకొండ కాస్త ఎమోషనల్ అయ్యాడు. దేశంలోనే మీలాంటి ఆడియన్స్ మరెక్కడ లేరని ఈ మాట ముంబయిలో కూడా అంటున్నారని చెప్పుకొచ్చాడు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏడాది కాలంగా మీ అందరిని చూడలేక పోయాను. లాక్ డౌన్‌ సమయంలో చాలా భయం వేసింది. మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా లు చూస్తారా అని సినిమా వాళ్లం మాట్లాడుకునేవాళ్లం. మీరు సినిమా ను ఎంతగా ఆధరిస్తున్నారో ఇప్పుడు మాకు తెలుస్తుంది. సినిమా అంటే ఎంతో మంది ఆధారపడి ఉంటారు. అలాంటి సినిమా ను మీరు ఆధరిస్తున్నారు. ముంబయి వెళ్తే మీ గురించే మాట్లాడుతున్నారు. సినిమా లను ఎంతగా ప్రేమిస్తారు.. ఏం సినిమాలు చూస్తారు.. ఈవెంట్ అని చెప్పగానే వేల మంది వస్తారు. ఇన్ని సినిమాల అనౌన్స్‌ మెంట్‌ లు.. ఇన్ని పాన్ ఇండియా సినిమాలు ఇంతగా జనాలు ఎక్కడైనా ఉంటారా తెలుగు ప్రేక్షకులను బీట్ చేసే ప్రేక్షకులు మరెక్కడ కూడా లేరని విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

ఇక జాతి రత్నాలు టీం గురించి విజయ్ మాట్లాడుతూ ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నాకు నా జీవితం ఏదో ఒక మాదిరిగా ముడి పడి ఉంది. ఆరు సంవత్సరాల క్రితం మేము సినిమాల్లో రాణిస్తాం.. మా ముందు జనాలు ఉంటే వారితో మాట్లాడుతాం అనుకునే వాళ్లం. ఇప్పుడు అది నిజం అయ్యింది. కలిసి తిరిగా.. తిన్నాం.. పడుకున్నాం కష్టపడ్డాం. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నాగి. ఆయన కొట్లాడి ఎవడే సుబ్రమణ్యంలో నాకు పాత్ర ఇచ్చాడు. వాళ్లలా వీళ్లలా నటించకుండా నీవు నీలా ఉంటూ నటించు అని చెప్పాడు. నాగి మరియు వైజయంతి వారికి కృతజ్ఞతలు అన్నాడు.