Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ మజిలీ క్యాన్సల్‌ అవ్వలేదు

By:  Tupaki Desk   |   3 Oct 2020 11:03 AM IST
రౌడీ స్టార్‌ మజిలీ క్యాన్సల్‌ అవ్వలేదు
X
విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. మజిలీ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత శివ నిర్వాన ప్రస్తుతం నానితో ఒక సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత రౌడీ స్టార్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ లోపు పూరి సినిమాను విజయ్‌ పూర్తి చేస్తాడనుకున్నారు. ఇంతలో సుకుమార్‌ మూవీ ప్రకటన రావడంతో విజయ్‌ దేవరకొండ.. శివ నిర్వానల మూవీ పక్కకు పెట్టారనే వార్తలు గుప్పుమన్నాయి. పూరి మూవీ పూర్తి అయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాను విజయ్‌ దేవరకొండ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. కాని ఈ వార్తలు నిజం కాదని సినీ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందుతోంది.

ముందుగా కమిట్‌ అయినట్లుగా పూరి మూవీ పూర్తి అయిన తర్వాత శివ నిర్వాన మూవీని విజయ్‌ దేవరకొండ చేయబోతున్నాడు. ఆ తర్వాత అంటే 2021 చివర్లో లేదా 2022లో సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాను విజయ్‌ దేవరకొండ మొదలు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్న సుకుమార్‌ వచ్చే ఏడాది చివరి వరకు బిజీ బిజీగానే ఉంటారు. కనుక ఈ లోపు విజయ్‌ దేవరకొండ శివ నిర్వాన మూవీ కంప్లీట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్‌ దేవరకొండ శివ నిర్వాన కాంబో మూవీ క్యాన్సిల్‌ అవ్వలేదు. వచ్చే ఏడాదిలో విజయ్‌ దేవరకొండను మజిలీ వంటి ఒక విభిన్నమైన సినిమాతో శివ నిర్వాన చూపించనున్నాడు.