Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న రౌడీ హీరో 'షర్ట్ లెస్' సెల్ఫీ!!

By:  Tupaki Desk   |   5 Jan 2021 10:07 AM IST
వైరల్ అవుతున్న రౌడీ హీరో షర్ట్ లెస్ సెల్ఫీ!!
X
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ అలాగే యంగ్ మాస్ హీరో కాంబినేషన్ పై అభిమానులలో అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. ఇక మొదటి నుండి ఈ కాంబినేషన్ సినిమాకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ నామమాత్రంగా పాపులర్ అవుతోంది. పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాతో విజయ్‌ బాలీవుడ్ ఇండస్ట్రీకి, అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం కాబోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా విజయ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ రౌడీ హీరో గోవా బీచ్ లో ప్రత్యక్షమయ్యాడు. అది కూడా షర్ట్ లేకుండా.. ఫేవరేట్ హీరోలను షర్ట్ లేకుండా చూస్తే అభిమానులకు సెలెబ్రేషన్స్ అనే చెప్పాలి. 'ఓరు అదార్ లవ్' ఫేమ్ రోషన్ సెల్ఫీ తీసి నెట్టింట పోస్ట్ చేసాడు. అంతే విజయ్ హెయిర్ స్టయిల్, గడ్డం అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. పూరీ సినిమా కోసం ఇలా మంచి మజిల్ ఫిజిక్ రెడీ చేసాడని తెలుస్తుంది. ఇక ఫైటర్ అనే సినిమాలో ఇలాంటి బాడీతో హీరో ఫైట్ చేస్తే ప్రేక్షకులకు వినోదమే. ఇక పూరీ సినిమాలలో హీరో అంటే డిఫరెంట్ స్టైల్.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటారు. ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఇండస్ట్రీ నుండి చాలామంది సినీతారలు బీచ్ ప్రదేశాలనే ఎంచుకుంటున్నారు. అలాగే విజయ్ కూడా గోవాలో ఛిల్ల్ అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. త్వరలోనే పూరీ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.