Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ పాత్ర గురించి లీక్ ?
By: Tupaki Desk | 17 Jun 2019 11:26 AM ISTగత ఏడాది వరస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా కొత్త సినిమాతో రానే లేదు. డియర్ కామ్రేడ్ వచ్చే నెలాఖరుతో బోణీ కొట్టనుంది. దీంతో పాటు సమాంతరంగా షూటింగ్ జరుపుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కూడా ఓ కొలిక్కి వస్తోంది. దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన లీక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం ఇందులో విజయ్ దేవరకొండ రైటర్ గా కనిపిస్తాడట. మూడు కథలు ప్రేక్షకులకు చెబుతూ ఆ మూడింటిలోనూ తనే కథానాయకుడిగా కనిపించడం అసలు ట్విస్ట్ అట. అయితే వాటికి ఒకదానితో మరొకటి కనెక్షన్ ఉండటమే కథను మరో మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. ఇదేదో వెరైటీగా ఉందనిపిస్తోంది కదూ. హీరో పాత్రలు రైటర్లుగా చేయడం చాలా అరుదు. ఆయనకు ఇద్దరులో జగపతి బాబు అల్లరి ప్రియుడులో రాజశేఖర్ ఇలా అడపాదడపా ట్రై చేశారు కానీ అదో ట్రెండ్ లా ఎప్పుడూ కొనసాగలేదు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ ట్రై చేస్తున్నాడు అంటే ఏదో ప్రత్యేకత ఉన్నట్టే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. అన్నట్టు ఒక పాత్ర కార్మిక నాయకుడిగా మరో పాత్ర విదేశాలలో ఉండే ఎన్ఆర్ఐ అనే మరో లీక్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. మరి ఆ మూడో పాత్ర సస్పెన్స్ మాత్రం కొనసాగనుంది. రాశి ఖన్నా ఐశ్వర్య రాజేష్ హీరొయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి కేఎస్ రామారావు నిర్మాత