Begin typing your search above and press return to search.
కంప్లీట్ మాస్ హీరోగా రెడీ అవుతున్న వీడీ..!
By: Tupaki Desk | 11 Dec 2020 7:49 AM IST'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ.. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 'టాక్సీవాలా' పర్వాలేదనిపించినా 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' నిరాశపరిచాయి. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నప్పటికీ, మాస్ ఇమేజ్ కి మాత్రం దగ్గర కాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో కంప్లీట్ మాస్ హీరోగా అవడానికి విజయ్ దేవరకొండ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా భాగస్వామిగా వ్యహరిస్తున్నారు. ఇందులో విజయ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే 'ఫైటర్' సినిమాతో కంప్లీట్ మాస్ హీరో అనిపించుకోడానికి ట్రై చేస్తున్న విజయ్.. బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీడి మార్కెట్ లో కాస్త కొరతగా ఉన్న ఈ మాస్ ఇమేజ్ ని పూరీ పూర్తిగా ఫిల్ చేస్తాడేమో చూడాలి.