Begin typing your search above and press return to search.
నెంబర్ ప్లేట్స్ పై రౌడీ...పోలీసుల యాక్షన్!
By: Tupaki Desk | 20 March 2019 10:25 PM IST`అర్జున్ రెడ్డి` సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. వరుస సినిమాలతో యూత్ లో వెర్రి క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ క్రేజ్ ను తన బ్రాండ్ ఇమేజ్ కు పునాదిగా చేసుకుని రౌడీ పేరుతో బ్రాండ్ ని సృష్టించాడు. ఇది యూత్ లో వేలం వెర్రిగా వైరల్ అయిపోయింది. రౌడీ బ్రాండ్ అంటూ చిత్రమైన కాస్ట్యూమ్స్ తో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. రౌడీ పేరుతో డ్రెస్ కోడ్‌ని మెయింటైన్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేయడం ఇప్పుడు వారికే చిక్కులు తెచ్చిపెడుతోంది.
విజయ్ బ్రాండ్ ఇమేజ్ చట్రంలో పడిపోయిన ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ప్రదర్శించడం కోసం ఏకంగా తమ వాహనాలపై రౌడీ అని రాయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రౌడీ అని అత్యధిక సంఖ్యలో విజయ్ ఫ్యాన్స్ నెంబర్ ప్లేట్స్ పై ముద్రించుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు లాఠీ ఝులిపించడం మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ పై రౌడీ సింబల్ వున్న ఓ టూవీలర్ ని పట్టుకుని జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా నెంబర్ ప్లేట్లపై రౌడీ సింబల్ వేసుకోవడం చట్టవిరుద్ధమని ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీసులు ఫేస్ బుక్ లో పలువురికి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ పోస్ట్ పై స్పందించిన రౌడీ బాస్ విజయ్ దేవరకొండ తన కారణంగా ఇబ్బింది ఎదురైంది కాబట్టి వారి తరుపున తాను క్షమాపణ చెబుతున్నట్టు విజయ్ దేవరకొండ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు రిప్లై ఇచ్చాడు. అలాగే అభిమానులని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు `మీరంతా నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. నా వల్ల మీరు కష్టల్లో ఇరుక్కోవద్దు. కొన్ని రూల్స్ మనం తప్పకుండా పాటించాలి. అవన్నీ మన మంచి కోసం పెట్టినవే. మీ ప్రేమను ఎలాగైనా చూపించండి. కానీ నెంబర్ ప్లేట్స్ పై మాత్రం బండి నెంబర్లనే వుంచండి` అని పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.