Begin typing your search above and press return to search.
పెళ్లంటే రౌడీ ఫీలింగ్ ఇదీ
By: Tupaki Desk | 28 Dec 2018 10:04 AM GMTటాలీవుడ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్లకు కొదవేం లేదు. అందులో నైజాం మెగాస్టార్ గా జనామోదం పొందిన విజయ్ దేవరకొండకు గాళ్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రౌడీ లాంటి బోయ్ ఫ్రెండ్ కావాలని కలలగనే యువతులకు తెలుగు రాష్ట్రాల్లో కొదవేం లేదు. నైజాంతో పాటు ఏపీలోనూ విజయ్ కి గాళ్స్ లో ఫాలోయింగ్ అసాధారణంగా ఉంది. అయితే రౌడీగారి కన్ను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మీద పడ్డట్టే ఉంది.
గత కొంత కాలంగా డియర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీగా ఉన్న దేవరకొండ తనకు కాకినాడ అమ్మాయిని పెళ్లాడాలనుందని అనేశాడు. బ్యాక్ గ్రౌండ్ తో అస్సలు ఏ సంబంధం లేకుండా తనను ఇష్టపడే అమ్మాయి దొరికితే పెళ్లాడేస్తానని అన్నాడు. అయితే పెళ్లి ఇప్పుడే కాదు.. దానికి కాస్త సమయం కావాలని అన్నాడు.
2018 సంవత్సరం దేవరకొండ నామ సంవత్సరంగా డిక్లేర్ చేయాలి. ఈ ఏడాదిలో రెండు బ్లాక్ బస్టర్లతో సత్తా చాటాడు దేవరకొండ. `గీతగోవిందం` చిత్రంతో ఎవరూ ఊహించని విధంగా 100కోట్ల క్లబ్ హీరో అయ్యాడు. ఆ తర్వాత టాక్సీవాలా చిత్రంతో ఈర్ ఎండ్ ని అద్భుతంగా ముగించాడు. అందుకే దేవరకొండ పేరు మార్మోగిపోతోంది. గాళ్స్ లోనూ అతడికి ఉన్న క్రేజు మామాలుగా లేదు. ఇక కాకినాడతో దేవరకొండకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన వంద కోట్ల క్లబ్ సినిమా `గీతగోవిందం`లో కాకినాడ కుర్రాడిగానే నటించాడు.
ఇప్పుడు కూడా మైత్రి మూవీమేకర్స్ లో నటిస్తున్న `డియర్ కామ్రేడ్` కాకినాడ పరిసరాల్లోనే తెరకెక్కిస్తున్నారు. అక్కడ రకరకాల లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు. లోకల్ విద్యార్థులు ఈ షూటింగులో పాల్గొన్నారు. కాకినాడ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అసలు రెండో ఆలోచనే లేకుండా కాకినాడ అమ్మాయిని పెళ్లాడేస్తాడట.