Begin typing your search above and press return to search.

ఏడాదిలో ఎంత ఎదిగిపోయాడో..

By:  Tupaki Desk   |   26 Aug 2018 7:00 AM IST
ఏడాదిలో ఎంత ఎదిగిపోయాడో..
X
మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ అయ్యాడు. కానీ ఆయన స్టార్ ఇమేజ్ సంపాదించడానికి చాలా ఏళ్లు పట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఆ స్థాయిని అందుకున్నారు. ఆ తర్వాత రవితేజ లాంటి వాళ్లు కూడా బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ మాస్ రాజా కూడా ఒక్కసారిగా స్టార్ అయిపోలేదు. కానీ విజయ్ దేవరకొండ అలా కాదు. ఒక్కసారిగా అతను ఎన్నో మెట్లు ఎక్కేశాడు. పోయినేడాది ఇదే రోజు విజయ్ దేవరకొండ ప్రతాపం మొదలైంది. కేవలం ఒక టీజర్.. ఇంకో ట్రైలర్ ‘అర్జున్ రెడ్డి’ మీద అంచనాలు పెంచేస్తే.. విజయ్ తనదైన యాటిట్యూడ్ తో ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చాడు.

సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రభంజనమే సృష్టించింది. విజయ్ కు మాంచి క్రేజ్ వచ్చింది. కానీ దీన్ని అతను ఏమేరకు నిలబెట్టుకుంటారో అని సందేహించిన వాళ్లు కూడా లేకపోలేదు. ‘అర్జున్ రెడ్డి’ ఒక మిరాకిల్ అని.. అలాంటి విజయాలు మళ్లీ మళ్లీ సాధ్యం కావని అన్నారు. కానీ ఇప్పుడు ‘గీత గోవిందం’ అంతకుమించిన క్రేజ్ తెచ్చుకుంది. ‘అర్జున్ రెడ్డి’ని మించిన విజయం సాధించింది. ఈ చిత్ర విజయంలో మేజర్ క్రెడిట్ విజయ్ దేవరకొండకు దక్కుతుందనడంలో సందేహం లేదు. ఒక మామూలు సినిమానే విజయ్ మరో రేంజికి తీసుకెళ్లాడు. విడుదలకు ముందు వచ్చిన హైప్.. భారీగా సాగిన అడ్వాన్స్ బుకింగ్స్ .. వీటన్నింట్లో విజయ్ పాత్ర కీలకం. 50 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉన్న ఈ చిత్రం.. ఫుల్ రన్లో రూ.60 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఏడాది వ్యవధిలో విజయ్ దేవరకొండ ఎదిగిన వైనం మాత్రం అనూహ్యమనే చెప్పాలి.