Begin typing your search above and press return to search.
సెల్ఫ్ డబ్బా ఆపుతావా దేవరకొండ!
By: Tupaki Desk | 14 Nov 2021 10:00 AM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాణంలో రూపొందిన పుష్పక విమానం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడటంతో పాటు ఇలాంటి పాత్రను ఎంపిక చేసుకోవడం అభినందనీయం అంటూ ప్రశంసలు దక్కాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో వస్తున్నట్లుగా అనిపించడం లేదంటే ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తీవ్రంగా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. విడుదలకు ముందు తమ్ముడితో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాను హీరోగా నటిస్తే ఎలా ప్రమోషన్స్ చేస్తాడో అలా సినిమాకు ప్రమోషన్స్ చేశాడు. సినిమా విడుదల సమయంలో పుష్పక విమానంపై అంచనాలు భారీగా కలిగేలా రౌడీ చేశాడు అనడంలో సందేహం లేదు.
ఇక విజయ్ దేవరకొండ పుష్పక విమానం విడుదల అయిన వెంటనే లైగర్ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా తన తమ్ముడి పుష్పక విమానం ను ప్రమోట్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ తాను వెగాస్ కు వచ్చాను.. ఇక్కడ ఉన్న వారు పుష్పక విమానం చూసేందుకు వస్తే తనను కలవచ్చు అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లుగా తన నిర్మాణంలో వచ్చిన సినిమాను ప్రమోట్ చేసేలా వ్యాఖ్యలు చేశాడు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చిత్రీకరణ కోసం అక్కడకు వెళ్లి పుష్పక విమానం ప్రమోషన్ చేయడంపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.. మరి కొందరు మాత్రం విజయ్ దేవరకొండ అక్కడ కూడా సెల్ఫ్ డబ్బా ఆపడం లేదుగా అంటూ సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
పుష్పక విమానం సినిమా ను వీకెండ్ లో వెగాస్ లో విజయ్ దేవరకొండ తో కలిసి చూసే అవకాశంను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. దాంతో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అక్కడ ఇక్కడ లైగర్ సినిమా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయం. యూఎస్ షెడ్యూల్ ను ఈ నెల చివరి వరకు ముగించుకుని యూనిట్ సభ్యులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.