Begin typing your search above and press return to search.

నవ్వి నవ్వి చస్తారంటున్న దేవరకొండ

By:  Tupaki Desk   |   19 April 2018 5:56 AM GMT
నవ్వి నవ్వి చస్తారంటున్న దేవరకొండ
X
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అతడి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు కలిసి నిర్మించిన ‘టాక్సీవాలా’లో అతను కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకుని.. ‘ది ఎండ్’ అనే హార్రర్ థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇదొక చిల్ టీం కలిసి చేసిన చిల్ మూవీ అని.. ఈ సినిమా చూసి జనాలు నవ్వి నవ్వి చస్తారని విజయ్ దేవరకొండ చెప్పడం విశేషం. మెంటల్ మెంటల్ అయితే ఇలాంటి సినిమాలు వస్తాయంటూ విజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.

వాడు ఇదన్నాడు.. ఆమె అదంది.. ఇంకేదో అయిందిం అంటూ జనాలు రకరకాల బాధలు పడుతుంటారని.. ఐతే అవన్నీ మరిచిపోయి ఈ సమ్మర్లో ఒక పాప్ కార్న్ బకెట్ పట్టుకుని వచ్చి ‘టాక్సీవాలా’ థియేటర్లో కూర్చోవాలని.. కచ్చితంగా ఎంటర్టైన్ చేసి పంపుతామని అతనన్నాడు. ఇందులో మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదని.. ఇదొక క్రేజీ మూవీ అని.. ప్రేక్షకులు నవ్వి నవ్వి చచ్చిపోతారని అతనన్నాడు. ‘పెళ్ళిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తన నుంచి వస్తున్న మరో వైవిధ్యమైన సినిమా ఇదని చెప్పాడు. కెరీర్లో ఫలానా ఫలానా వాళ్లతో సినిమా చేయాలని ఉంటుందని.. ‘టాక్సీవాలా’ సినిమాతో గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ బేనర్లతో పని చేయడం ద్వారా రెండు పేర్ల దగ్గర టిక్ మార్కులు అయిపోయాయని.. ‘గీతా’లో ఇంకో సినిమా చేస్తుండటం తన అదృష్టమని విజయ్ అన్నాడు.