Begin typing your search above and press return to search.

టాలీవుడ్ 'సూప‌ర్ ప‌వ‌ర్ స్టార్' విజ‌య్!

By:  Tupaki Desk   |   23 Aug 2018 10:21 PM IST
టాలీవుడ్ సూప‌ర్ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్!
X
`అర్జున్ రెడ్డి` వంటి క‌ల్ట్ క్లాసిక్ మూవీతో టాలీవుడ్ లో న‌యా సెన్సేష‌న్ గా త‌న‌దైన ముద్ర వేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌....గీత గోవిందంతో టాలీవుడ్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో న‌యా సూప‌ర్ స్టార్ గా అవ‌త‌రించాడంటూ విజ‌య్ ఫ్యాన్స్ ...సంబ‌ర‌ప‌డిపోతున్నారు. త‌మ హీరోను సూప‌ర్ ప‌వ‌ర్ స్టార్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా విజ‌య్ కు ఇదే ప్ర‌శ్న ఎదురైంది. దానికి విజ‌య్ ఆస‌క్తిక‌రంగా స‌మాధాన‌మిచ్చాడు. తానెప్ప‌టికీ విజయ్ దేవరకొండలానే ఉంటాన‌ని, ప్రేక్ష‌కులు - అభిమానులు పెట్టే ట్యాగ్ లైన్స్ త‌న‌ను ప్రభావితం చేయలేవ‌ని అన్నాడు. అయితే, అలా పిల‌వ‌డం వ‌ల్ల త‌న‌కు ఇబ్బంది లేద‌ని....చల్తా అని లైట్ తీసుకున్నాడు.

అర్జున్ రెడ్డి నుంచి గోవిందం పాత్ర‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అయిన విజ‌య్ పై ప్రేక్ష‌కుల‌తోపాటు విమ‌ర్శ‌కులూ ప్ర‌శంస‌లు కురిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గోవింద్ పాత్ర‌లో విజ‌య్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌ల‌క‌డంతో....బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ ను `సూప‌ర్ ప‌వ‌ర్ స్టార్ `అంటూ అభిమానులు పొగుడుతున్నారు. అయితే, త‌న‌కు అలా పిలిపించుకోవ‌డం వ‌ల్ల ఇబ్బంది లేద‌ని, కానీ తాను విజ‌య్ దేవ‌ర‌కొండ‌గానే ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నాడు. ఆ బిరుదును అంగీకరిస్తే బాగుంటుందని ఆ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అభిమానులు కోర‌గా...విజయ్ ఆ స‌మాధాన‌మిచ్చాడు. త‌న త‌ర్వాతి సినిమాలపై ఈ ఎఫెక్ట్ ఉంటుందని త‌న‌కు నచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతాన‌ని, వాటిని ప్రేక్ష‌కులు అంగీకరిస్తే చాలని అన్నాడు. త‌న‌కు అంతకుమించిన ‘స్టార్’ గుర్తింపు ఏమీ ఉండదని విజయ్ త‌న‌దైన మార్క్ డైలాగ్ చెప్పాడు.