Begin typing your search above and press return to search.

వారసత్వంలో తప్పేమీ లేదన్న విజయ్ దేవరకొండ

By:  Tupaki Desk   |   3 Oct 2018 11:00 PM IST
వారసత్వంలో తప్పేమీ లేదన్న విజయ్ దేవరకొండ
X
సినిమా పరిశ్రమలో సుడి తిరగడం అంటే ఏంటో నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నాడు విజయ్ దేవరకొండ. స్వంత టాలెంట్ ఎంత ఉన్నా ఎంతో కొంత కాలం కూడా కలిసివస్తేనే ఎవరైనా విజేతలుగా నిలిచేది. ఆ విషయంలో విజయ్ రెండు రకాలుగా సక్సెస్ అవుతూ ఐదు సినిమాల వయసుకే క్రేజీ హీరోగా మారిపోయాడు. గీత గోవిందం ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న మూవీగా నోటా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడంతో దాని ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్ దేవకొండ. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో వారసత్వం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఇచ్చిన ఆసక్తికరమైన సమాధానం ఇతను మాటల్లో ఎంత నేర్పుతో ఉంటాడో తేటతెల్లమవుతుంది.

విషయానికి వస్తే వారసత్వం గురించి అభిప్రాయం చెప్పమనప్పుడు నిర్మాత ఎవరైనా తన పెట్టుబడికి సేఫ్టీ చూసుకుంటాడని అది స్టార్ హీరోల ఫామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయితే కనీస గ్యారెంటీ ఉంటుంది కాబట్టి అలా చేయటంలో తప్పేమి లేదన్నాడు. వారసత్వం కార్డుతో ఎంట్రీ అవకాశాలు సులభమని కానీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే తనలాంటి వాళ్లకు మాత్రం చాలా కఠిన పరిస్థితులు ఉంటాయని నాన్న తనను ముందే హెచ్చరించాడని విజయ్ చెప్పడం విశేషం. సినిమా హీరో కంటే 400 మందితో పోటీ పడే సివిల్స్ పరీక్ష సులభమన్న నాన్న మాట ఇంకా మర్చిపోలేదని చెప్పాడు.

కానీ నమ్మకం తనను నడిపించిందని అందరికి కాకపోయినా తనలాగే ఎదిగే అవకాశం వచ్చినప్పుడు సరైన రీతిలో వాడుకుంటే విజయాలు వరిస్తాయని చెప్పి సపోర్ట్ లేకుండా వచ్చే నటులకు కాస్త స్ఫూర్తి నిచ్చే ప్రయత్నం చేసాడు. సివిల్స్ కంటే కష్టమైన సినిమా ప్రస్థానాన్ని సరైన రీతిలో మల్చుకుంటున్న విజయ్ దేవరకొండ మరో రెండేళ్ల దాకా ఖాళీ లేను అంటున్నాడు. కమిట్ అయిన సినిమాలతో పాటు మాట ఇచ్చిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యేసరికి అంతే టైం పడుతుందట.