Begin typing your search above and press return to search.

ఎక్కడకి పోయావు యంగ్ హీరో

By:  Tupaki Desk   |   3 Feb 2018 5:00 AM IST
ఎక్కడకి పోయావు యంగ్ హీరో
X
ఒక యంగ్ హీరోకి ఓ బ్రహ్మాండమైన హిట్ వస్తే స్పీడ్ చూపించాలని ప్రయత్నించడం సహజం. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ అందుకున్న కల్ట్ హిట్ అలాంటిదే. అంతకుముందే పెళ్లిచూపులుతో సక్సెస్ సాధించినా.. మధ్యలో ఓ సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా తెలీనంత ఘోరంగా ఆడినా.. అర్జున్ రెడ్డి మాత్రం విజయ్ దేవరకొండకు బోలెడంత ఇమేజ్ తెచ్చిపెట్టింది.

ఇలాంటి హిట్ వచ్చిన తర్వాత చకచకా సినిమాలు ఒప్పేసుకోవడం.. టకటకా లైన్ లో దింపేయడం.. ఇమేజ్ పెంచుకునేందుకు పన్నాగాలు పన్నడం లాంటివి చూస్తాం. కానీ ఫిబ్రవరి ముగిసిపోతే అర్జున్ రెడ్డి రిలీజై.. ఆరు నెలలు అవుతుంది. అయినా ఇప్పటివరకూ కొత్త సినిమా రిలీజ్ అవుతున్న ఊసేమీ వినిపించడం లేదు. అలాగని బద్ధకించి సినిమాలు చేయడం మానేశాడా అంటే అదీ లేదు. ఏకంగా ఓ అరడజన్ ప్రాజెక్టుల్లో ఈ హీరో పేరు వినిపిస్తోంది. గ్యాప్ లేకుండా నటించేస్తున్నాడు. అయినా సరే.. అర్జున్ రెడ్డి తర్వాత ఇంతవరకు మరో సినిమా లేదు. స్టార్ హీరోలను పక్కన పెడితే.. ప్రస్తుతం యంగ్ హీరోలు స్పీడ్ గానే సినిమాలు చేస్తున్నారు.

కనీసం ఏడాదికి రెండు సినిమాలు పడితే.. అందులో ఒకటైనా మంచి హిట్ సాధిస్తూ ఉంటే.. అప్పుడు కొన్నేళ్లకు కానీ మన ఆడియన్స్ ఆ హీరోను స్టార్ అని ఒప్పుకోరు. ప్రస్తుతం నాని అలాగే స్టార్ డం పట్టేశాడు. శర్వానంద్ అర్ధం చేసుకున్నాడు. మరి అర్జున్ రెడ్డి ఎందుకు డిలే చేస్తున్నాడో అర్ధం కాని విషయమే. ఇప్పటికైతే ఓ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి కానీ.. వీటిలో ఏదీ సమ్మర్ కు ముందు వచ్చే ఛాన్స్ లేదు.