Begin typing your search above and press return to search.
ఆ నిర్మాత ఒత్తిడికి విజయ్ తలొగ్గాడా?
By: Tupaki Desk | 9 Sept 2019 7:00 AM ISTవిజయ్ దేవరకొండకు కెరీర్లో ఇప్పటిదాకా తగిలిన అతి పెద్ద ఎదురు దెబ్బ అంటే డియర్ కామ్రేడ్ సినిమానే ఏమో. విజయ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడీ చిత్రాన్ని. దర్శకుడు భరత్ కమ్మను ఎంతో నమ్మి.. ఈ కథ మీద భరోసాతో తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామని ప్రపోజల్ తీసుకొచ్చింది అతనే. సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమా తరహాలో దీన్ని ఓన్ చేసుకుని గట్టిగా ప్రమోట్ చేశాడు విజయ్. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. విషయం ఉన్న సినిమానే అయినప్పటికీ దాని మీద విపరీతమైన నెగెటివ్ ప్రచారం చేసి చంపేశారన్న అనుమానాలు విజయ్ క్యాంపులో ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ అగ్రెషన్ కొంచెం తగ్గించుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.
విజయ్ తో సినిమా చేద్దామని ప్రయత్నించి విఫలమైన ఓ అగ్ర నిర్మాత డియర్ కామ్రేడ్ గురించి జరిగిన వ్యతిరేక ప్రచారంలో కీలక పాత్ర పోషించాడనే గుసగుసలు ఇండస్ట్రీలో నడుస్తుండటం గమనార్హం. సాధారణంగా ఆ నిర్మాత ఇలాంటి పని చేస్తాడని ఎవరూ అనుకోరు. అయితే విజయ్ తీరు ఆయనకు నచ్చక.. కొందరు స్టార్ హీరోల అభిమానులు అదే పనిగా డియర్ కామ్రేడ్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుంటే ఆ గ్రూపులకు తెర వెనుక సపోర్ట్ ఇచ్చాడు అన్నది ఒక ఆరోపణ. అయితే విజయ్ ఈ విషయంలో ఫ్రస్టేట్ అవకుండా.. ఇండస్ట్రీలో వ్యవహారాలు ఎలా ఉంటాయో అర్తం చేసుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నాడని.. సదరు అగ్ర నిర్మాతతో ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడని అంటున్నారు. గత ఏడాది చివర్లో ఓ చిన్న సినిమాతో హిట్ కొట్టిన యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.