Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి కోరిక విన్నారా!!

By:  Tupaki Desk   |   6 Dec 2017 12:25 PM IST
అర్జున్ రెడ్డి కోరిక విన్నారా!!
X
పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అర్జున్ రెడ్డి తో వైరల్ హీట్ ను చూపించిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఎలాంటి సినిమా చెస్తాడా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఒక క్యూట్ అండ్ కూల్ లవ్ స్టోరీ - హార్డ్ అండ్ బోల్డ్ లవ్ స్టోరీ తర్వాత ఈ యువ హీరో ఎంచుకునే కథ ఏ స్థాయిలో ఉంటుందో గాని కొంచెం భారీ అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ ప్రముఖులతో పరిచయాలు కూడా పెంచుకుంటున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందట. ప్రతిసారీ కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా ఏదైనా కొత్తదనం ఉన్న కథలనే ఒకే చేస్తానని ఇంతకుముందు విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మనోడి మనసులో ఒక మంచి యాక్షన్ తరహాలో ఉన్న గ్యాంగ్ స్టర్ సినిమాను చేయాలని ఉందట. రీసెంట్ గా ఒక కన్నడ సినిమా ఆడియో వేడుకలో తన మనసులోని కోరికను చెప్పాడు.

రష్మిక మందాన - గణేష్ జంటగా నటించిన కన్నడ ఫిల్మ్ చమక్ ఆడియో లాంచ్ వేడుక జరిగింది. రష్మీక విజయ్ - పరశురామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ వేడుకలో పాల్గొన్న విజయ్ కన్నడ ఇండస్ట్రీపై ప్రశంసల జల్లును కురిపించారు. ఇకపోతే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్ ని చూసి నాకు కూడా అలాంటి గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ లో నటించాలని ఉందని చెప్పాడు. మరి మన దర్శకులు ఈ యువ హీరో కోసం ఏదైనా కథ రెడీ చేస్తారో లేదో చూడాలి.