Begin typing your search above and press return to search.
దేవరకొండ.. సినిమాల్లోకి ఎలా వచ్చాడు?
By: Tupaki Desk | 3 Oct 2018 1:54 PM ISTఈ రోజుల్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. ఐతే విజయ్ దేవరకొండ అలాగే వచ్చి పేరు సంపాదించాడు. చాలా వేగంగా స్టార్ అయిపోయాడు. మరి అతను సినిమాల్లోకి ఎలా వచ్చాడు.. అతడి తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చారా లేదా అన్నది ఆసక్తికరం. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు విజయ్.
విజయ్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఇంట్లో ఊరికే సినిమాలు చూస్తూ గడుపుతుండటంతో ఒకసారి అతడి తండ్రి మందలించాడట. తాను ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నానని.. ఆ డబ్బుల్ని వృథా చేయొద్దని.. ఏదైనా పనికొచ్చే పని చేయమని తండ్రి అన్నాడట. దీంతో విజయ్ కి చాలా కోపం వచ్చి.. తనకు సినిమాలంటే ఆసక్తి అని.. తనను న్యూయార్క్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో చేర్చమని చెప్పాడట. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి తన తండ్రి ఒప్పుకోడని భావించి ఊరికే సరదాగా ఆ మాట అన్నాడట విజయ్. కానీ వారం రోజుల తర్వాత తన తండ్రి ఒక థియేటర్ గ్రూప్ తో మాట్లాడి తనను అక్కడ చేర్పించడంతో షాక్ తిన్నట్లు విజయ్ తెలిపాడు.
అప్పటికి తనకు నటన మీద కానీ.. సినిమాల మీద కానీ ఏమీ ఆసక్తి లేదని.. ఐతే థియేటర్ గ్రూప్ లో నటన గురించి నేర్చుకోవడం.. ప్రదర్శనలు ఇచ్చినపుడు వచ్చే ప్రశంసలు ఆనందాన్నివ్వడంతో నెమ్మదిగా ఆసక్తి పెరిగిందని చెప్పాడు. ఐతే తాను సినిమాల్లోకి రావాలనుకున్నపుడు మాత్రం.. ఇది చాలా కష్టమని.. సివిల్స్ రాసి ఆఫీసర్ కావడం దీని కంటే ఈజీ అని.. అక్కడ ప్రతి సంవత్సరం 400 దాకా పోస్టులుంటాయని.. కానీ నటుడిగా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదని చెప్పాడని.. అయినా తాను వినకుండా సినిమాల్లోకి వచ్చానని విజయ్ చెప్పాడు.