Begin typing your search above and press return to search.
దేవరకొండ దండయాత్ర కంటిన్యూ!
By: Tupaki Desk | 25 Jan 2019 7:02 PM ISTతెలుగు హీరోలు ఈమధ్య ఇతర భాషా మార్కెట్లపై ఫోకస్ చేయడం కాస్త ఎక్కువయింది. ప్రభాస్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. లాంటి స్టార్లు ఇప్పుడు తమ సినిమాలు ఇతర భాషలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే తమిళ మార్కెట్ పై ఫోకస్ చేశాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'నోటా' అనే తమిళ -తెలుగు ద్విభాషా చిత్రం తో తన లక్కును టెస్టు చేసుకున్నాడు కానీ సినిమా నిరాశపరిచింది.
అలా అని మన రౌడీగారు తన ప్రయత్నాలు ఆపడం లేదట. ప్రస్తుతానికి లైన్లో ఉన్న రెండు సినిమాలు 'డియర్ కామ్రేడ్'.. క్రాంతి మాధవ్ ప్రాజెక్ట్ మాత్రం తెలుగు మార్కెట్ కోసమే గానీ ఆ తర్వాత చేయబోయే సినిమా మాత్రం తమిళ-తెలుగు బై లింగువల్ అని సమాచారం. ఈమధ్యే ఒక నూతన దర్శకుడు రెండు భాషల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ చెప్పి విజయ్ ను మెప్పించాడట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఆ డెబ్యూ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం లైన్లో ఉన్న రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళతాడట.
'నోటా' కోసం తమిళ భాషను నేర్చుకొనిమరీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న విజయ్ ఈ సారి తమిళభాషపై మరింతగా పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ సారి డబ్బింగ్ వీలైనంత సహజంగా చెప్పి తమిళ ఆడియన్స్ ను బుట్టలో పడెయ్యాలని కంకణం కట్టుకున్నాడట.