Begin typing your search above and press return to search.

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ స్టోరీ ఇదే.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి హీరో!

By:  Tupaki Desk   |   20 April 2021 2:30 AM GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ స్టోరీ ఇదే.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి హీరో!
X
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, డాషింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘లైగర్’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని చార్మి-క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టికే విడుదలైన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అద్భుతంగా ఆక‌ట్టుకుంది.

‘సాలా క్రాస్ బ్రీడ్‌’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ కు అభిమానుల నుంచి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాదాపు 120 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం.. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంద‌న్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

లైగ‌ర్ స్టోరీ ఇదేనంటూ.. ఫిల్మ్ న‌గ‌ర్లో ఓ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. పూరీ సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ‘నేను వేరు.. నా హీరో వేరు.. మేమంతా అదోర‌కం’ అన్నట్టుగా ఉంటాయి ఆయ‌న సినిమాలు. కానీ.. ఆడియ‌న్స్ కు మాత్రం ఆ ప‌ద్ధ‌తే తెగ న‌చ్చుతుంది.

అలాంటి డైరెక్ట‌ర్ కు విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరో జ‌త‌కావ‌డంతో.. అంచ‌నాలు పీక్స్ కు చేరాయి. ఈ క్ర‌మంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన స్టోరీ లైన్.. అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో విజ‌య్ జాతీయ స్థాయి బాక్స‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట.

నేష‌న‌ల్ లెవల్ కు చేరుకోవ‌డం ఫ‌స్ట్ హాఫ్ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ కు చేరుకునే బాక్స‌ర్ గా క‌నిపిస్తాడ‌ట‌. ఈ క్ర‌మంలో అత‌నికి ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌లు.. అడ్డంకులు.. వాటిని ఎదుర్కొనే విధానం క‌లిపి.. ఫుల్ లెంగ్త్ మాస్ ఫీస్ట్ ను అందిస్తాయ‌ని తెలుస్తోంది.

పూరీ మార్క్ టేకింగ్ తో విజ‌య్ పెర్ఫార్మెన్స్ తో సినిమా నెక్స్ట్ లెవ‌ల్ కు వెళ్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి, లైగ‌ర్ దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలంటే.. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే.