Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : షర్ట్‌ విప్పి అమ్మాయిలను టెంప్ట్‌ చేస్తున్న రౌడీ

By:  Tupaki Desk   |   6 Aug 2020 11:02 PM IST
ఫొటోటాక్‌ : షర్ట్‌ విప్పి అమ్మాయిలను టెంప్ట్‌ చేస్తున్న రౌడీ
X
రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండకు యూత్‌ లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గీతా గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండకు లేడీస్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగి పోయింది. అమ్మాయిల కలల రాకుమారుడిగా రౌడీ స్టార్‌ పేరు దక్కించుకున్నాడు. అమ్మాయిలతో ప్రేమగా రౌడీ అంటూ పిలిపించుకుంటున్న విజయ్‌ దేవరకొండ ఈ ఫొటోతో అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు. మామూలుగానే అతడి నవ్వుతో అమ్మాయిలు పడిపోతారు. ఇలా ఎక్స్‌ పోజింగ్‌ చేస్తే అమ్మాయిలు తట్టుకోలేస్తారా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ తన పెట్‌ డాగ్‌ ను ముద్దు చేస్తున్న ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ షర్ట్‌ విప్పి మరీ ఈ ఫొటోకు ఫోజ్‌ ఇవ్వడంతో అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. రౌడీ స్టార్‌ అమ్మాయిలను టెంప్ట్‌ చేసేందుకు ఇలా అర్థనగ్నంగా ఫొటోకు ఫోజ్‌ ఇచ్చాడా అంటూ కొందరు సరదాగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. కరోనా కారణంగా గత నాలుగు అయిదు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన రౌడీ స్టార్‌ ఇలా కుటుంబ సభ్యులతో పెట్స్‌ తో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు.