Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ తో కాఫీకి రౌడీ ఒక్క‌డేనా లేక జ‌త‌గా..!

By:  Tupaki Desk   |   30 May 2022 3:22 AM GMT
క‌ర‌ణ్ తో కాఫీకి రౌడీ ఒక్క‌డేనా లేక జ‌త‌గా..!
X
క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా ర‌న్ అవుతున్న హిందీ రియాలిటీ షో `కాఫీ విత్ క‌ర‌ణ్` పాపులారిటీ అంతా ఇంతా కాదు. సెల‌బ్రిటీల‌తో ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూలు ప్రేక్ష‌కుల మైండ్ పై ఎంతో మ్యాజిక్ చేస్తుంటాయి. ఈ షోలో సెల‌బ్రిటీల గురించిన కొన్ని బ‌య‌టికి తెలియ‌ని ర‌హ‌స్యాలు బ‌హిర్గ‌త‌మ‌వుతుంటాయి.

తాజా గుస‌గుస‌ల ప్రకారం కాఫీ విత్ క‌ర‌ణ్ కొత్త సీజ‌న్ ఓటీటీలో ఉంటుంది. ఇందులో ప‌లువురు టాప్ స్టార్లు పాల్గొంటుండ‌గా సౌత్ నుంచి కొంద‌రి ఎంపిక ఉంటుంద‌ని తెలిసింది. ముఖ్యంగా లైగ‌ర్ ఫేం విజయ్ దేవరకొండ విస్తృతంగా ప్రజాదరణ పొందిన టాక్ షో కాఫీ విత్ కరణ్ లో అల‌రించ‌నున్నార‌ని అధికారికంగా ధృవీకరించారు. దేవరకొండ `లైగర్` కోస్టార్ అనన్య పాండేతో కలిసి కాఫీ విత్ కరణ్ లో పాల్గొంటార‌ని స‌మాచారం. క‌ర‌ణ్ తో ఈ షోలో క‌నిపించ‌డం రౌడీకి ఇదే తొలిసారి.

కాఫీ విత్ కరణ్ ఎడిషన్‌లో చాలా మంది సౌత్ సినీసెలబ్రిటీలు పాల్గొన్నారు. అందులో ప్ర‌భాస్ తో పాటు రానా - రాజ‌మౌళి ఉన్నారు. ఆర్‌.ఆర్.ఆర్ స్టార్లు చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ల‌కు ఈ షోలో ప్ర‌చారానికి అవ‌కాశం ద‌క్కింది. మునుముందు ఈ జాబితా అంత‌కంత‌కు పెర‌గ‌నుంది. ఇప్పుడు దేవ‌ర‌కొండ‌కు అవ‌కాశం ద‌క్కింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌- అన‌న్య జంట లైగ‌ర్ కి ప్ర‌చారం చేయ‌నున్నారు. అలాగే త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను క‌ర‌ణ్ తో షేర్ చేసుకోనున్నారు. విజయ్ దేవరకొండ ప్ర‌స్తుతం `ఖుషి` సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌శ్మీర్ లోయ‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఆ త‌ర్వాత సుకుమార్ తో విజ‌య్ వేరొక చిత్రంలో నటించాల్సి ఉంటుంది.