Begin typing your search above and press return to search.

'సారా చాలా స్వీట్'.. డేటింగ్ చేయడంపై VD స్పందన ఇదే..!

By:  Tupaki Desk   |   10 Aug 2022 10:35 AM GMT
సారా చాలా స్వీట్.. డేటింగ్ చేయడంపై VD స్పందన ఇదే..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ''లైగర్'' సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వీడీ.. ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. గత కొన్నాళ్లుగా ఎక్కువగా ముంబైలో చక్కర్లు కొడుతూ.. బీటౌన్ లో ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకునేలా చేసాడు.

'లైగర్' సినిమా రిలీజ్ అవ్వకముందే విజయ్ యాటిట్యూడ్ కి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఫ్యాన్స్ గా మారిపోయారు. ముఖ్యంగా మన రౌడీ బాయ్ అక్కడి హీరోయిన్ల మనసులను కొల్లగొడుతున్నాడు. అందుకే ప్రతీ బ్యూటీ కూడా అతనితో డేటింగ్ చేయడానికి రెడీ అంటున్నారు.

ఇటీవల బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. సారా తో పాటు జాన్వీ కపూర్ సైతం అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. తాజాగా సారా డేటింగ్ కామెంట్ పై VD స్పందించాడు.

ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. సారా అలా చెప్పడం స్వీట్ గా ఉందన్నాడు. ''సారా అలా అనడం చాలా నచ్చింది. నాకు ఆమె ఎఫెక్షన్ అర్థమైంది. అలాగే నేను తనకి మేస్సేజ్ కూడా చేసి థ్యాంక్స్ చెప్పాను. తను చాలా స్వీట్. అందుకే నా గురించి అలా మాట్లాడగలిగింది'' అని అన్నాడు విజయ్.

అలాగే సారా ఆలీఖాన్ తో డేటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా.. 'లేదు. నాకు రిలేషన్షిప్స్ మీద అంత ఇంట్రస్ట్ లేదు' అని తెలిపాడు. ఆ సమయంలో రిలేషన్షిప్ అనే పదం పలకడానికి కొంచెం ఇబ్బంది పడ్డ విజయ్.. 'నాకు రిలేషన్షిప్ అనే పదమే సరిగ్గా పలకడం రావట్లేదు. అలాంటి ఎలా డేటింగ్ చేయగలను' అంటూ అక్కడి వారిని నవ్వించాడు.

ఇకపోతే ‘కాఫీ విత్ కరణ్’ షోలో మీరు డేటింగ్ చేయాలనుకుంటున్న వారి పేరు చెప్పండి? అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ పేరును చెప్పింది సారా. దీనిపై ఇన్స్టాగ్రామ్ లో VD స్పందించారు. 'నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు బిగ్ హగ్' అంటూ హార్ట్ సింబర్ పెట్టి క్యాప్షన్ తో స్టోరీ పెట్టాడు.

కాగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' సినిమాలో ఎంఎంఏ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. మైక్ టైసన్ - రమ్యకృష్ణ - విషు రెడ్డి - రోనీత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

'లైగర్' చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.