Begin typing your search above and press return to search.

ఇన్ స్టా వేదిక‌గా కోటిన్న‌ర రౌడీలు

By:  Tupaki Desk   |   15 April 2022 8:00 PM IST
ఇన్ స్టా వేదిక‌గా కోటిన్న‌ర రౌడీలు
X
రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ కొన్ని గంటల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక అద్భుత‌ వీడియోను షేర్ చేసి తన ఫాలోవర్లను ఆశ్చర్యపరిచాడు. అడవి మధ్యలో ఒక నిశీధి మార్గంలో ఒంటరిగా నడుస్తూ క‌నిపించాడు ఈ వీడియోలో. అతను తన పోస్ట్ కి `లాంగ్ వాక్స్` అని క్యాప్షన్ ఇచ్చాడు. అతని అందమైన చిరునవ్వు అందమైన రూపం ఫాలోవ‌ర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంత‌లోనే విజ‌య్ దేవ‌రకొండ ఇన్ స్టా వేదిక‌గా అరుదైన మైలురాయిని ట‌చ్ చేశాడు. ఇప్ప‌టికి అత‌డిని ఏకంగా కోటిన్న‌ర (1.5 మిలియ‌న్) మంది అనుస‌రిస్తున్నారు. 1.5 మిలియ‌న్ల రౌడీలు అంటూ ప్ర‌చారం హోరెత్తిపోతోంది. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ వైన్ గ్లాస్ తో చీర‌ప్ చేస్తున్న ఫోటో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `లైగర్` చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఛార్మి కౌర్- పూరి- కరణ్ జోహార్- అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవ‌ర‌కొండ స‌ర‌స‌న‌ అనన్య పాండే క‌థానాయిక‌గా న‌టించింది. ఆగ‌స్టులో సినిమా విడుద‌ల కానుంది.