Begin typing your search above and press return to search.

విజయ్ - ఓ అంతుచిక్కని పజిల్

By:  Tupaki Desk   |   18 Aug 2018 11:00 PM IST
విజయ్ - ఓ అంతుచిక్కని పజిల్
X
సినిమా పరిశ్రమలో విజయ లక్ష్మి ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుందో చెప్పడం బ్రహ్మ తరం కూడా కాదేమో అనిపిస్తుంది కొందరి విజయ గాధలను చూస్తే. ఏళ్ళు కష్టపడితే కానీ దొరకని స్టేటస్ కొందరికి ఓ పది సినిమాలకే దొరికేస్తే పాతిక సినిమాలు చేసినా ఇప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో కిందామీదా పడే హీరోలకు ప్రతిది అగ్ని పరీక్షలా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ అందరికి ఓ అంతుచిక్కని పజిల్ లా కనిపిస్తున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ గా చెప్పబడుతున్న గీత గోవిందం ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ సైతం నివ్వెరపోతోంది. అర్జున్ రెడ్డి అంటే అందులో ఉన్న బోల్డ్ కంటెంట్ తో పాటు పబ్లిసిటీ పరంగా చేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి పెద్ద రేంజ్ హిట్ అయ్యింది అనుకున్నవాళ్లే ఎక్కువ. కానీ దర్శకుడు సందీప్ వంగ ఏ ఉద్దేశంతో అయితే ఆ పాత్రను డిజైన్ చేసాడో ఆ ఫీల్ ని ఎమోషనల్ గా క్యారీ చేసేలా విజయ్ దేవరకొండ పోషించిన తీరు ప్రేక్షకుల మనసులో అలా ప్రింట్ అయిపోయింది. దాని తాలూకు ప్రభావం ఇప్పటికీ యూత్ లో బలంగా ఉంది. తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రల్లో నటిస్తున్న విజయ్ అంటే క్రేజ్ అంతకంతకు పెరుగుతూపోవడం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదుగుతున్నాడా అనే అనుమానం రావడం సహజం. సోలో హీరోగా పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. పెళ్లి చూపులు-అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం మూడో సక్సెస్ అంతే. ఈ మాత్రానికే విజయ్ దేవరకొండ ఇంత పాపులర్ కావడం అంటే పజిల్ కాక మరేమిటి. విచిత్రంగా అభిమానులు విజయ్ దేవరకొండను పోటీకి అతీతమైన హీరోగా పేర్కొనడం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతనికి పోటీ ఎవరంటే వెంటనే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏ సీజన్ కా సీజన్ ఒక్కొక్క హీరోతో సక్సెస్ దోబూచులాడుతున్న పరిశ్రమలో మిడిల్ రేంజ్ హీరోల మధ్య పోటీని ఒకరో లేక ఇద్దరికో పరిమితం చేయటం కరెక్ట్ కాదు. విజయ్ దేవరకొండ టాలెంటో లేక అదృష్టమో కానీ ఇతన్ని తమలో చూసుకోవడమే యూత్ లో ఫాలోయింగ్ పెరిగేలా చేస్తోంది. అర్జున్ రెడ్డిలో డబ్బున్న ఫామిలీ నుంచి వచ్చిన మెడికోగా చేసిన రోల్ తప్పించి మిగిలినవన్నీ చాలా సాదాసీదా పాత్రలు. పెళ్లి చూపులులో మిడిల్ క్లాస్ కుర్రాడిగా గీత గోవిందంలో ఓ మాములు సగటు కుటుంబం నుంచి వచ్చిన కుర్ర లెక్చరర్ గా ఇలా అన్ని మెజారిటీ యూత్ కు కనెక్ట్ అయ్యేవే. రానున్న వాటిలో ఒకదాంట్లో టాక్సీ డ్రైవర్ గా మరోదాంట్లో ఆవేశం ఆదర్శం ఉన్న కాలేజీ స్టూడెంట్ గా ఇలా పాత్రల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత ఏడాది దాకా గ్యాప్ వచ్చినా ఇప్పుడు దాన్ని చాలా తెలివిగా పూడ్చుకునే ప్లాన్ లో ఉన్నాడు. చూస్తుంటే మిడ్ రేంజ్ లో సెటిల్ కావడం అతని టార్గెట్ లా కనిపించడం లేదు. దానికి తగ్గట్టే తక్కువ టైం ఈ రేంజ్ లో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ రానున్న రెండు మూడేళ్ళలో ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టే ఎలా సెటిల్ అవుతాడు అనేది ఆధారపడి ఉంటుంది.