Begin typing your search above and press return to search.
ఆహా షోలో మనసులు దోచేసిన రౌడీ!
By: Tupaki Desk | 16 Sept 2022 6:12 PM ISTప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` కోసం ఓంకార్ ఆహాతో కలిసి ఓక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై `డాన్స్ ఐకాన్` పేరుతో ఓ రియాలిటీ షోని నిర్వహిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో ఇటీవల స్ట్రీమింగ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ లో వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. వారిని ఫస్ట్ ఎపిసోడ్ లో పరిచయం చేస్తూ ఒక్కొ కంటెస్టెంట్ వెనకున్న దీన గాధని వివరించారు.
ఇదే షోలో రాయచూర్ నుంచి వచ్చిన ఆనంద్ అనే కంటెస్టెంట్ పరిస్థితి ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఆనంద్ రాయచూర్ లోని ఓ స్లమ్ ఏరియాలో వుండే నిరుపేద యువకుడు. అతని తండ్రి ఆటో డ్రైవర్. నిత్యం పని చేస్తే తప్ప ఇళ్లు గడవని పరిస్థితి. అయితే ఆనంద్ కి మాత్రం డ్యాన్స్ అంటే పిచ్చి. అతని ఇష్టాన్ని గమనించిన డ్యాన్స్ టీచర్ మోనిక .. ఆనంద్ కు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే ఆనంద్ కు `డాన్స్ ఐకాన్` లో పాల్గొనడానికి డబ్బు లేదు. కావాల్సిన డ్రెస్ లు లేవు.
దీంతో తను నిత్యం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే డ్రెస్ లోనే షోలో పాల్గొన్నాడు ఆనంద్. తన ప్రదర్శన అక్కడున్న వారందరినీ కదిలించింది. ఈ షోకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓంకార్ ..ఆనంద్ దయనీయ పరిస్థితిని గురించి వెల్లడించాడు. షోలో పాల్గొనడానికి అతనికి డ్రెస్ కూడా లేదని చెప్పడంతో విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు.
`ఎవడే సుబ్రమణ్యం` టైమ్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి తన వద్ద కూడా డ్రెస్ లు లేవని, ఇదే విషయాన్ని నిర్మాతకు చెప్పి అందులో వాడిన డ్రెస్ లని తెచ్చుకుని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నానని, అలా తీసుకున్న బట్టలు `అర్జున్ రెడ్డి` వరకు వచ్చాయని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఈ షో కోసం రౌడీ బ్రాండ్ నుంచి నీకు తగ్గ డ్రెస్ లని పంపిస్తా.. నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేయి` అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా హర్షాన్ని వ్యక్తం చేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.