Begin typing your search above and press return to search.

రాహుల్ కోసం 'శ్యామ్ సింగరాయ్‌'కి రౌడీ స్టార్‌ ఓకే

By:  Tupaki Desk   |   17 March 2021 4:30 AM GMT
రాహుల్ కోసం శ్యామ్ సింగరాయ్‌కి రౌడీ స్టార్‌ ఓకే
X
నాని హీరోగా ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్‌ సింగరాయ్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని కెరీర్‌ లో బిగ్గ్‌ చిత్రంగా చెబుతు అంచనాలు పెంచేస్తున్నారు. నాని ఇప్పటి వరకు చేయని పాత్ర అవ్వడంతో పాటు తెలుగు లో ఇలాంటి తరహా నేపథ్యం రాలేదు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో శ్యామ్‌ సింగరాయ సినిమా కోసం నాని అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లోని క్లైమాక్స్ లో ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా కీలకంగా ఉంటుందట. అందుకే ఆ పాత్రను హీరో నారా రోహిత్ తో చేయించాలని మొదట భావించారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారట.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్రను రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండతో చేయించాలని భావిస్తున్నారట. ట్యాక్సీవాలా సినిమాతో దర్శకుడు రాహుల్‌ కు మరియు విజయ్ దేవరకొండకు మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అందుకే ఈ సినిమాలో అడిగిన వెంటనే విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడని అంటున్నారు. షూటింగ్‌ ముగింపు దశలో విజయ్ దేవరకొండ మరియు నానిల కాంబో సీన్స్ ను చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల జాతి రత్నాలు సినిమాలో విజయ్ దేవరకొండ మెరిశాడు. ఆ సెంటిమెంట్ తో శ్యామ్‌ సింగరాయలో విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సెంటిమెంట్ లేదా మరేదైనా కాని విజయ్ దేవరకొండ ఉండటం వల్ల శ్యామ్‌ సింగరాయ్ కు అదనపు ఆకర్షణ ఖాయం అంటున్నారు.