Begin typing your search above and press return to search.

ఇంట్లో నన్ను 'రియల్ మ్యాన్'లా ట్రీట్ చేయడం లేదు...!

By:  Tupaki Desk   |   24 April 2020 5:01 AM
ఇంట్లో నన్ను రియల్ మ్యాన్లా ట్రీట్ చేయడం లేదు...!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విసిరిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేక మన 'రౌడీ' ఫెయిల్ అయ్యాడు. అవునండి.. కొరటాల శివ విసిరిన ‘బీ ద రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్ ని మన 'రౌడీ' విజయ్ దేవరకొండ స్వీకరించలేకపోతున్నాడట. అయితే దానికి కారణం విజయ్ ఆ ఛాలెంజ్ ని పూర్తి చేయలేకనో.. తప్పించుకోవడానికో కాదు. ఇంట్లో వాళ్ళ అమ్మ గారి కారణంగా రియల్ మ్యాన్ అనిపించుకోలేక పోతున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఒకరికొకరు ‘బీ ద రియ‌ల్ మ్యాన్’ అనే సవాలును విసురుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటి పనుల్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలని 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ వంగా ప్రారంభించిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ కు టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మంచి స్పందన వస్తోంది. రాజమౌళి నుంచి వచ్చిన సవాలును స్వీకరించిన యంగ్ ‌టైగర్ ఎన్టీఆర్.. తను రియల్ మ్యాన్ అనిపించుకుని.. తనలాగే రియల్ మ్యాన్ అనిపించుకోవాలని మరికొందరిని నామినేట్ చేశారు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన డైరెక్టర్ కొరటాల శివ.. ఆ ఛాలెంజ్ ని యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు విసిరాడు.

అయితే విజయ్ దేవరకొండ ఇంట్లో ఏదైనా పని చేస్తే.. వాళ్ల అమ్మ మళ్లీ చేసుకోవాల్సి వస్తుందని.. డబుల్ పని అవుతుందని ఈ టాస్క్‌ను చేయనీయడం లేదంట. అదే విషయాన్ని విజయ్ దేవరకొండ తనకు ఛాలెంజ్ విసిరిన కొరటాలకు ఫన్నీగా ట్వీట్ రూపంలో విన్నవించుకున్నాడు. ''శివ సార్.. మా మమ్మీ నన్ను పని చేయనీట్లే.. పని డబుల్ అవుతుందంటా.. ఇంట్లో ఇంకా రియల్ మెన్‌లా చూడట్లే మమ్మల్ని.. పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు.. కానీ ఈ లాక్‌ డౌన్‌లో ఏదొకరోజు దానికి సంబంధించిన గ్లిమ్స్‌ని మీకు చూపిస్తాను..’’ అని విజయ్ దేవరకొండ ఫన్నీగా ట్వీట్‌లో తెలిపారు. విజయ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘బీ ద రియ‌ల్ మ్యాన్’ ఛాలెంజ్ లో ఇప్పటి దాకా సందీప్ వంగా - రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - చిరంజీవి - వెంకటేష్ - కొరటాల శివ - సుకుమార్ - కీరవాణి - శోభు యార్లగడ్డ మొదలైన వారు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఛాలెంజ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో చూడాలి.