Begin typing your search above and press return to search.

దేవరకొండ 'ఫొటో' మిస్టరీ వీడింది..

By:  Tupaki Desk   |   23 Aug 2018 10:29 AM IST
దేవరకొండ ఫొటో మిస్టరీ వీడింది..
X
కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ 10వ తరగతిలో ఉన్నప్పుడు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నూనుగు మీసాల విజయ్ ఎంతో చూడముచ్చటగా ఉన్నాడు. ఆ ఫొటోను విజయ్ ఎక్కడా ఇవ్వలేదు.. షేర్ చేయలేదు.. కానీ అది బయటకు వచ్చింది. దీన్ని వివిధ సామాజిక మాధ్యమాల్లో చూసిన విజయ్ ఈ ఫొటో ఎక్కడిది.? ఎలా వచ్చింది.? అని ఆశ్చర్యపోయాడు..? దానిపై తీవ్రంగా పరిశోధించాడట.. తన టెన్త్ క్లాస్ మేట్స్ అందరినీ అడిగాడట.. తన ఫొటోను ఎవరు సోషల్ మీడియాలో పెట్టాలనే దానిపై విజయ్ తెగ ఆలోచించాడు..

విజయ్ దేవరకొండ.. ప్రవర్తన అందరికీ షాకిస్తోంది. గీతాగోవిందం సందర్భంగా ఆయన తొలిసారిగా గొంతు సవరించుకొని పాడిన పాట చెత్తగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పోటెత్తాయి. మరో హీరో అయితే ఈ ట్రోలింగ్ ను చూసి బాధపడేవారు.. కానీ విజయ్ ఏకంగా తన ట్రోలింగ్ లను గీతా గోవిందం ఫంక్షన్ లో చూపించి అందరికీ షాకిచ్చాడు. అలాంటి విజయ్ ప్రస్తుతం తన టెన్త్ ఫొటో లీక్ కావడంపై మాత్రం కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశాడట.. ఈ ఫొటోను లీక్ చేసిన వారి గురించి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది..

విజయ్ దేవరకొండ 10వ తరగతిని సత్య యూనివర్సిటీలో చదువుకున్నాడు. విజయ్ దేవరకొండ స్నేహితుడు సాయి మనోహర్ ద్వారా ఈ ఫొటోను ఓ అమ్మాయి సంపాదించిందట.. ఆ అమ్మాయి ప్రస్తుతం వెబ్ మీడియాలో విధులు నిర్వహిస్తోంది. ఆ అమ్మాయికి సీనియర్ విజయ్ దేవరకొండ తెలుసు. ఇప్పుడు విజయ్ స్టార్ హీరో కావడంతో ఆమే సాయి నుంచి ఫొటో తీసుకొని దానిపై కథనం రాసి వైరల్ చేసింది. తన జూనియర్ అమ్మాయి ఈ ఫొటో సంపాదించిందని తెలిసుకొని ఎట్టకేలకు ఈ ఫొటో మిస్టర్ వీడడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశాడట..