Begin typing your search above and press return to search.

ఆ క్లబ్బులో నేను లేను అంటున్న దేవరకొండ

By:  Tupaki Desk   |   28 April 2020 5:20 PM IST
ఆ క్లబ్బులో నేను లేను అంటున్న దేవరకొండ
X
యువ హీరో విజయ్ దేవరకొండ ఈమధ్య ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రాజీవ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించాడు. లాక్ డౌన్ లో ఎలా ఉంటున్నారు? అని అడిగితే "ఈ లాక్ డౌన్ లో నేను పూర్తిగా షట్ డౌన్ అవ్వాలని అనుకున్నాను. ఏం చెయ్యడం లేదు అనే గిల్టీనెస్ లేకుండా ఖాళీ గా ఉండేందుకు ఈ విశ్వం మనకు ఓ అవకాశం ఇచ్చిందని అనుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నాను.. హాయిగా నిద్రపోతున్నాను. బయట ఇబ్బందులు పడేవారిని తలుచుకున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. అది పక్కన పెడితే నేను లాక్ డౌన్ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తున్నాను" అన్నాడు.

"మీరు బంజారా బాయ్స్ క్లబ్ లో ఉన్నారా?" అనేది మరో ప్రశ్న. ఇంతకీ ఈ బంజారా బాయ్స్ క్లబ్ ఏంటంటే టాలీవుడ్ లో కొందరు హీరోల బ్యాచ్ అన్నమాట. ఈ గ్యాంగ్ లో రామ్ చరణ్.. ఎన్టీఆర్.. రానా దగ్గుబాటి తదితరులు ఉన్నారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ ఆ క్లబ్ లో లేనని చెప్పాడు విజయ్. ఆ క్లబ్ లో ఉండే హీరోలు అందరూ తనకు సీనియర్లని.. ఫ్రెండ్స్ అనడం సరికాదని అన్నాడు. కొంతకాలం తర్వాత ఈ క్లబ్ లో రౌడీగారిని కూడా కూడా చేర్చుకుంటారేమో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నారు కదా.. ఎవరైనా హీరోలు మీకు కాల్ చేశారా అని అడిగితే ఈమధ్య తనకు కాల్ చేసిన హీరో రానా దగ్గుబాటి మాత్రమేనని చెప్పాడు.

విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ విరమణ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది.