Begin typing your search above and press return to search.

జీవితంలో పెళ్లి వద్దనుకున్నాను

By:  Tupaki Desk   |   28 Jan 2019 11:01 AM IST
జీవితంలో పెళ్లి వద్దనుకున్నాను
X
విజయ్‌ దేవరకొండ తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. యువతకు, సినిమాల్లోకి రావాలనుకునే వారికి మంచి సందేశాన్ని ఇచ్చాడు. తాను జీవితంను ఒక సిద్దాంతంతో జీవించాలని భావించాను. ఏ పని చేసినా కూడా డెడ్‌ లైన్‌ పెట్టుకుని చేయాలనుకున్నాను. డెడ్‌ లైన్‌ పెట్టుకుని పని చేస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. డిమాండ్‌, సప్లై సూత్రాన్ని బట్టి ఎక్కడైనా పని చేయాలి. ఎక్కడ అవకాశాలున్నాయో చూసుకుని అక్కడ పని చేసుకుంటూ వెళ్లడమే. ఇండస్ట్రీలో లీడ్‌ యాక్టర్స్‌ లోటు ఉంది. దాన్ని నేను గుర్తించి ప్రయత్నించాను, ఇతరుల కంటే తాను విభిన్నంగా చేస్తాననే నమ్మకంతో హీరోగా ప్రయత్నించానంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు.

హీరోగా ప్రయత్నాలకు డెడ్‌ లైన్‌ పెట్టుకున్నాను. 25 ఏళ్లు వచ్చే వరకు ప్రయత్నాలు చేసి, ఆ తర్వాత కూడా రాకుంటే రైటర్‌ గా లేదంటే డైరెక్షన్‌ రంగానికి వెళ్లి పోవాలనుకున్నాను. 30 సంవత్సరాల వరకు వెయిట్‌ చేయవద్దు అంటూ హీరోగా ప్రయత్నాలు చేసే వారికి సలహా ఇచ్చాడు. జీవితంలో అనుకున్న లక్ష్యంను చేరుకోకుంటే పెళ్లి చేసుకోవద్దనుకున్నాను, పెళ్లి చేసుకుంటే బాధ్యతలు చాలా ఉంటాయి కనుక లక్ష్యం చేరుకోనప్పుడు పెళ్లి కి దూరంగా ఉండాలని భావించాను. కాని ఇప్పుడు పెళ్లికి ఓకే అన్నాడు. విభిన్నమైన చిత్రాలతో యూత్‌ ను కట్టి పడేస్తున్న విజయ్‌ దేవరకొండ తన మాటలతో కూడా యువతలో స్ఫూర్తిని నింపుతున్నాడు.

ప్రస్తుతం విజయ్‌ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తున్నాడు. సమ్మర్‌ లో విడుదల కాబోతున్న ఆ చిత్రంకు భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కొత్త దర్శకులతో ఈయన చేసిన సినిమాలు మంచి ఫలితాలను దక్కించుకుంటున్నాయి. కనుక డియర్‌ కామ్రేడ్‌ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక మైత్రి మూవీస్‌ బ్యానర్‌ ఒక చిత్రాన్ని, కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు విజయ్‌ డేట్లు ఇచ్చాడు.