Begin typing your search above and press return to search.
రౌడీస్టార్ః విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా.. యూట్యూబ్ చెబుతున్న నిజం!
By: Tupaki Desk | 8 March 2021 11:00 PM ISTతెలుగు ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూపించింది 'జాతిరత్నాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్. వరంగల్ లో నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రౌడీ హీరో. అయితే.. వరంగల్ కు విజయ్ దేవరకొండ వస్తున్నాడని తెలియగానే.. అభిమానులు భారీస్థాయిలో వచ్చేశారు. సభాప్రాంగణం మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయింది.
ఓ దశలో పోలీసులు కంట్రోల్ చేయలేక లాఠీచార్జ్ కూడా చేయాల్సిన వచ్చిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఇక, విజయ్ దేవరకొండ స్పీచ్ కూడా హైలెట్ గా నిలిచింది. వేదికపైకి వస్తూనే 'హలో కాకతీయ..' అని అరుస్తూ అభిమానులను హుషారెత్తించారు విజయ్. సినిమాతోపాటు అభిమానుల గురించి ఎక్కువగా మాట్లాడాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
ఇక, విజయ్ స్పీచ్ కేవలం స్టేడియంలో ఉన్నోళ్లను మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులను కూడా ఆకట్టుకుంది. తెలుగు ఆడియన్స్ లాంటివారు దేశంలోనే ఎక్కడా లేరని అన్నాడు విజయ్. బాలీవుడ్ లోనూ ఇదే మాట అంటున్నారని చెప్పాడు. ఈ విధంగా ఫుల్ జోష్ లో సాగిన వీడీ స్పీచ్.. యూట్యూబ్ లోనూ ట్రెండింగ్ గా మారింది. 24 గంటలు గడవకుండానే మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సత్తా చాటింది.
సంవత్సరం నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా.. విజయ్ దేవరకొండ క్రేజ్ ఫ్యాన్స్ లో ఏమాత్రం తగ్గలేదనే విషయం రుజువైంది. ప్రస్తుతం పూరీజగన్నాథ్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'లైగర్' మూవీలో నటిస్తున్నాడు వీడీ. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే.. ఈ రౌడీ హీరో క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరడం ఖాయం. ఈ మూవీని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతోంది యూనిట్.