Begin typing your search above and press return to search.

రౌడీ బాలీవుడ్ డెబ్యూ ఎవ‌రికి ఛాన్స్?

By:  Tupaki Desk   |   4 Sept 2019 11:28 AM IST
రౌడీ బాలీవుడ్ డెబ్యూ ఎవ‌రికి ఛాన్స్?
X
రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ దేవ‌ర‌కొండ‌ను హిందీ తెర‌కు ప‌రిచ‌యం చేస్తార‌ని ప్ర‌చార‌మైంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `డియ‌ర్ కామ్రేడ్` హిందీ రైట్స్ ని క‌ర‌ణ్ చేజిక్కించుకున్న నేప‌థ్యంలో ఈ సినిమా రీమేక్ తోనే హిందీ తెర‌కు ప‌రిచ‌యం అవుతాడ‌ని ప్ర‌చార‌మైంది. అయితే దేవ‌ర‌కొండ ఇంకా స్క్రిప్టును ఫైన‌ల్ చేయ‌లేద‌ని తెలుస్తోంది.

అత‌డు ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మకు స‌రిప‌డే స్క్రిప్టు కోసం వేచి చూస్తున్నార‌ట‌. ప‌లువురు ద‌ర్శ‌కులు వినిపించిన క‌థ‌ల్ని విన్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. దేవ‌ర‌కొండ బాలీవుడ్ డెబ్యూ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఉంటుందా? అంటే సందేహ‌మే. క‌ర‌ణ్ జోహార్ తో పాటుగా సాజిద్ న‌డియావాలా న‌డియావాలా గ్రాండ్ స‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ .. సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ కి చెందిన రాయ్ క‌పూర్ ఫిలింస్ సంస్థ‌లు దేవ‌ర‌కొండ‌ను హిందీ చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రు అత‌డిని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉంద‌ట‌. ఇప్ప‌టికే ఆ మూడు సంస్థ‌లు పంపించిన ద‌ర్శ‌కుల వ‌ద్ద క‌థ‌ల్ని విన్నార‌ట‌. అయితే దేనినీ ఫైన‌ల్ చేయ‌లేద‌ని తెలుస్తోంది.

`డియ‌ర్ కామ్రేడ్` తెలుగులో ఏవరేజ్ గా నిలిచిన నేప‌థ్యంలో ఏదైనా కొత్త క‌థ‌తోనే హిందీ సినిమా చేసేందుకు రౌడీ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అది కూడా బాలీవుడ్ లో వెంట‌నే చేసేయాల‌నే ఆలోచ‌న కూడా లేదు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈలోగానే హిందీలో ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేందుకు ముంబైకి వెళ్లాడ‌ట‌. అక్క‌డ ద‌ర్శ‌కర‌చ‌యిత‌లు వినిపించిన క‌థ‌లు వింటున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ క‌థ‌ను ఫైన‌ల్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో న‌టించినంత మాత్రాన తెలుగు చిత్ర‌సీమ‌ను వ‌దిలేస్తున్నాడ‌ని కాదు.. హిందీ ప‌రిశ్ర‌మ అద‌న‌పు హంగు మాత్ర‌మేన‌ని భావిస్తున్నాడ‌ట‌. టాలీవుడ్ నుంచి ప‌లువురు హీరోలు ఇరుగుపొరుగు మార్కెట్ల‌ను గుప్పిట ప‌డుతున్న వేళ దేవ‌ర‌కొండ తెలివైన అడుగులు వేస్తున్నాడ‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.