Begin typing your search above and press return to search.

రౌడీ బాయ్స్ రొమాంటిక్ సాంగ్ కోసం రౌడీ!

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:12 AM GMT
రౌడీ బాయ్స్ రొమాంటిక్ సాంగ్ కోసం రౌడీ!
X
దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశీష్ రెడ్డి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. క్రేజీ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్న ఈ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌ గా న‌టిస్తోంది. `హుషారు` ఫేమ్ హ‌ర్ష కొనుగంటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు త‌న సోద‌రుడు శిరీష్‌ తో క‌లిసి ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ‌పై ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర బృందం ఈ చిత్ర న‌ప్ర‌మోష‌న్స్ ‌ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని `అల‌లే అల‌లే.. ` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ ని రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల‌మీదుగా రిలీజ్ చేయించింది. ఈ పాట‌ని దేవిశ్రీ సంగీతం.. మ‌ధి ఫొటోగ్ర‌ఫీ చాలా బ్యూటిఫుల్‌గా ప్ర‌జెంట్ చేశాయి. అంతే కాకుండా ఆశీష్‌రెడ్డి.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ ల కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమా కోసం అనుప‌మ తొలిసారి లిప్ లాక్ స‌న్నివేశంలో న‌టించింది.

చాలా ఫ్రెష్ ‌గా సాగే స‌న్నివేశాలు.. అంతే ఫ్రెష్ ‌గా వాటిని ప్ర‌జెంట్ చేసిన సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ది కెమెరా ప‌నిత‌నం... ఈ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌ లుగా నిల‌వ‌బోతున్నాయి. యువ ప్రేక్ష‌కుల్ని టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ మూవీ ఖ‌చ్చితంగా స‌రికొత్త ఫీల్ ని అందించ‌డం ఖాయం అని చెప్పొచ్చు. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా రూపొందుతున్న `రౌడీ బాయ్స్‌` త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.