Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండలో ఇంత వినయమా?

By:  Tupaki Desk   |   8 Oct 2017 11:00 PM IST
విజయ్ దేవరకొండలో ఇంత వినయమా?
X
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ చాలా యారొగెంట్ అన్న ముద్ర పడిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలకు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్లో అతడి వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ తర్వాత కూడా ఆ పాత్ర తాలూకు యాటిట్యూడే చూపిస్తూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సాగిపోయాడు విజయ్. ఐతే ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ హ్యాంగోవర్ నుంచి బయటికొచ్చేసినట్లున్నాడు విజయ్. తాజాగా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’ ఆడియో వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. పూర్తి భిన్నంగా కనిపించాడు. పక్కన అల్లు అరవింద్ ఉండటం కూడా కారణమో ఏమో వేదికపై చాలా వినయంగా కనిపించాడు. వినమ్రంగా మాట్లాడాడు.

‘అర్జున్ రెడ్డి’తో హిట్టు కొట్టినా... గీతా ఆర్ట్స్ బ్యాకప్ లో రెండు సినిమాలు చేస్తున్నా.. తనను తాను ఇంకా ఒక స్ట్రగ్లింగ్ హీరో లాగే భావిస్తున్నట్లుగా విజయ్ దేవరకొండ చెప్పాడు. అందుకే ‘వీ4 క్రియేషన్స్’ అనే బేనర్ మొదలైందనగానే తనకు చాలా సంతోషంగా ఉందనిపించిందని అతనన్నాడు. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడం కోసం.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల కోసం ఈ బేనర్ పెట్టారని.. కాబట్టి ఒకవేళ తన కెరీర్ కొంచెం తిరగబడినా.. ఏదైనా కొత్త కాన్సెప్ట్ పిక్ చేసి వీళ్ల దగ్గరికి తీసుకెళ్తే తాను మళ్లీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుందన్న ఆశ ఉందని విజయ్ చెప్పాడు. ‘నెక్స్ట్ నువ్వే’ పెద్ద విజయం సాధించి ఈ బేనర్ కు మంచి ఆరంభాన్నివ్వాలని అతనన్నాడు. ఏడాదిగా గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ వాళ్లతో తాను ట్రావెల్ చేస్తున్నానని.. వాళ్లు హీరోల్ని చూసుకునే తీరు అద్భుతమని.. వాళ్లపై తనకు చాలా గౌరవం ఉందని విజయ్ చెప్పాడు.