Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్ :అర్జున్ రెడ్డి ఇంట్రో సీన్ ఇదే!

By:  Tupaki Desk   |   23 Aug 2017 8:34 AM GMT
ఎక్స్ క్లూజివ్ :అర్జున్ రెడ్డి ఇంట్రో సీన్ ఇదే!
X
దాదాపు సంవత్సరం నుంచి కొన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్న విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ అర్జున్ రెడ్డి విడుదలకి రెడీ అయింది. అనేక వాయిదాల ఆనంతరం ఆగస్ట్ 25న అర్జున్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కు - ట్రైలర్ కు సోషల్ మీడియాలో క్రేజ్ రావడం - యువత ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రెగ్యూలర్ గా ఫాలో అవ్వడంతో ఈ సినిమా బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రేజీ మూవీలో ఇంట్రో సీన్ ఇదే నంటూ ఓ పుకారు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తుంది. డ్రగ్స్ కి - మందుకి అలవాటు పడ్డ విజయ్ దేవరకొండ తన ఫ్లాట్ లోరి సోఫాలో నిద్రపోతుంటాడు. అతని ముందర చాలా మద్యం సీసాలు చెల్లచెదురుగా పడిపోయి ఉంటాయి. ఇంతలో సోఫాకి ఓవైపు నుంచి సన్నటి నీటిధార కారుతూ కనిపిపస్తుంది. పొద్దున్నే లేచి టాయిలేట్ కి వెళ్లడానికి కూడా బద్ధకం వేసి సోఫాలోనే మూత్రం పోసే క్యారెక్టర్ అర్జున్ రెడ్డిది అనే వాయిస్ ఓవర్ తో సినిమా మొదలుఅవుతుంది.

ఈ సన్నివేశం అర్జున్ రెడ్డిలో ఉందో లేదో తెలియదు కానీ, ఈ సీన్ గురించి వింటుంటే మాత్రం ఈ సినిమా కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుందని ఫిల్మ్ ఫోక్స్ అంటున్నారు. అలానే పెళ్లి చూపులు తరువాత ద్వారక అనే సినిమాలో నటించిన విజయదేవరకొండ విమర్శకుల్ని మెప్పించ్చాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ద్వారక బోల్తాకొట్టేసింది. ఈ ప్రభావం అర్జున్ రెడ్డి పై పడే అవకాశం కూడా ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో మరి అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో ఆడియెన్స్ ని అరిస్తాడో చూడాలి.