Begin typing your search above and press return to search.

VDని కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో క‌లుపుతున్న పూరి!

By:  Tupaki Desk   |   25 Aug 2022 4:13 AM GMT
VDని కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో క‌లుపుతున్న పూరి!
X
కేజీఎఫ్ ద‌ర్శ‌కుడిగా ప్రశాంత్ నీల్ కి ఉన్న ఇమేజ్ అసాధార‌ణ‌మైన‌ది. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా స‌త్తా చాటి సంచ‌ల‌నంగా మారిన అత‌డితో సినిమా చేయాల‌ని స్టార్ హీరోలంతా ఉవ్విళ్లూరుతున్నారు. ప్ర‌భాస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌మిటైన ప్ర‌శాంత్ నీల్ స‌లార్ చిత్రాన్ని మ‌రో లెవ‌ల్లో తెర‌కెక్కిస్తున్నాడ‌న్న టాక్ ఉంది.

ఆ త‌ర్వాత అత‌డు ఎన్టీఆర్ తో .. రామ్ చ‌ర‌ణ్ ల‌తో సినిమాలు చేస్తున్నాడు. బ‌న్ని.. మ‌హేష్ లాంటి స్టార్ల‌తో సినిమాలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కానీ ఇంత‌లోనే లైగ‌ర్ తో పాన్ ఇండియా రేస్ లో చేరుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అత‌డు పార్టీలో క‌నిపించ‌డం విస్మ‌య‌ప‌రిచింది. గత రాత్రి విజయ్ దేవరకొండ పార్టీకి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథిగా రావడం ర‌క‌ర‌కాల‌ పుకార్లకు దారితీసింది.

నేడు లైగ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ విడుదలను పురస్కరించుకుని చిత్ర‌బృందం పార్టీని ఏర్పాటు చేయ‌గా ఈ పార్టీలో ఛార్మి అతిథులకు సాద‌ర‌స్వాగ‌తం ప‌లికారు. పార్టీలో చిత్ర‌బృందంతో పాటు ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు.

ఇటీవలి కాలంలో తార‌క్ తో కానీ లేదా మెగా హీరోల‌తో కానీ క‌నిపిస్తున్న ప్ర‌శాంత్ నీల్ స‌డెన్ గా దేవ‌ర‌కొండ పార్టీలో క‌నిపించ‌డం తో ర‌క‌ర‌కాలుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

విజ‌య్ ని ప్ర‌శాంత్ నీల్ తో క‌లిపే ప్ర‌య‌త్నం పూరి చేస్తున్నాడ‌ని అందుకే ఈ పార్టీకి ప్ర‌త్యేకంగా ఆహ్వానించార‌ని కూడా వేదిక వ‌ద్ద గుస‌గుస‌లు వినిపించాయి. ఒకవేళ ఇదే నిజ‌మైతే దేవ‌ర‌కొండ రేంజు అమాంతం మారుతుంది. అయితే అందుకు ఇంకా చాలా స‌మ‌యం అత‌డు వేచి చూడాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర హీరోల‌తో వ‌రుస సినిమాలు చేస్తున్న ప్ర‌శాంత్ నీల్ .. స‌రైన స‌మ‌యంలో వీడీతో సినిమా చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదని గుస‌గుస వినిపిస్తోంది. నైట్ పార్టీలో విజయ్ దేవ‌ర‌కొండ‌- అనన్య పాండే- దర్శకుడు పూరి జగన్నాథ్- పూరి కుమారుడు ఆకాష్- స్టార్ రైట‌ర్ కోన వెంకట్- భోళాశంక‌ర్ ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.