Begin typing your search above and press return to search.
సెన్సిటివ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ
By: Tupaki Desk | 7 July 2018 1:55 PM ISTవరుసగా సినిమాలు చేస్తున్నా విడుదల విషయంలో సందిగ్దత ఎదురుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ ఆగష్టు 15న గీత గోవిందంతో దాన్ని బ్రేక్ చేయబోతున్నాడు. టాక్సీ వాలా ముందు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బయటికి చెప్పని ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికైతే గీత గోవిందం వచ్చాకే ఆ సినిమా వస్తుందనే విషయం ఖరారైనట్టే. ఇక వీటితో పాటు ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న నోటాతో పాటు ఇటీవలే మొదలుపెట్టిన డియర్ కామ్రేడ్ షూటింగ్ లతో యమా బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ ఏ మాత్రం గ్యాప్ లేకుండా తన కొత్త సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఎమోషనల్ మూవీస్ ని సెన్సిటివ్ గా తెరకెక్కిస్తాడు అని పేరున్న దర్శకుడు క్రాంతి మాధవ్ తో చేయబోయే సినిమాను అక్టోబర్ 10 నుంచి మొదలు పెట్టనున్నాడు. ఆ లోపు నోటా షూటింగ్ పూర్తయిపోయి ఉంటుంది కనక డియర్ కామ్రేడ్ తో పారలెల్ గా దీన్ని కూడా చేసుకోవచ్చు.
నిన్న విడుదలైన తేజ్ ఐ లవ్ యు నిర్మాత కెఎస్ రామారావు దీన్ని టేకప్ చేస్తారు. శర్వానంద్ తో మళ్ళి మళ్ళి రాని రోజు లాంటి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తీసిన క్రాంతి మాధవ్ ఆ స్కూల్ నుంచి బయటికి వచ్చి రెగ్యులర్ మసాలా గా ట్రై చేద్దామని సునీల్ తో తీసిన ఉంగరాల రాంబాబు దారుణ ఫలితాన్ని ఇచ్చింది. అందుకే మరోసారి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నే ఎంచుకున్నట్టు తెలిసింది. అర్జున్ రెడ్డి దెబ్బకు ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమాలు ఈ ఏడాది మూడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల గీత గోవిందం దసరా లేదా దీపావళికి నోటా ఏడాది చివర్లో డియర్ కామ్రేడ్ వచ్చేలా ప్లానింగ్ జరుగుతుందట. ఒకవేళ ఇదే నిజమైతే ఐదు నెలల కాలంలో మూడు సినిమాలు విడుదలైన యూత్ హీరోగా విజయ్ దేవరకొండ కొత్త రికార్డు సెట్ చేసినట్టే.