Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ గర్వించేలా చేస్తా : రౌడీస్టార్‌

By:  Tupaki Desk   |   23 Aug 2022 9:34 AM GMT
పవన్ ఫ్యాన్స్ గర్వించేలా చేస్తా : రౌడీస్టార్‌
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్‌ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమా కోసం గత నెల రోజులుగా విజయ్ దేవరకొండ ఉత్తర భారతం.. దక్షిణ భారతం అనే తేడా లేకుండా దేశం మొత్తం తిరుగుతూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

విజయ్ దేవరకొండ తాజాగా లైగర్‌ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఆ సందర్భంగా ఖుషి గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విలక్షణ దర్శకుడు.. విభిన్నమైన ప్రేమ కథలను వెండి తెరపై ఆవిష్కరించిన దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి అనే సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత జంటగా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఖుషి అనే పేరు వినగానే పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్‌ మూవీ గుర్తుకు వస్తుంది. ఆ సినిమా టైటిల్‌ ను విజయ్ దేవరకొండ సినిమా కు వినియోగించడం అనేది చాలా పెద్ద సాహస నిర్ణయం.

కాస్త ఫలితం తేడా కొడితే పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ఆడేసుకోవడం ఖాయం. అలాంటి ఖుషి టైటిల్ ను మీ సినిమా కు పెట్టారు కదా ఫీలింగ్ ఏంటీ అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానంను రౌడీ స్టార్ చెప్పాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్ నటించిన ఖుషి స్థాయిలో మా ఖుషి సినిమా కూడా ఉంటుందని అన్నాడు. ఏమాత్రం అనుమానం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ జనరేషన్ మొత్తానికి కూడా ఖుషి సినిమా ఒక అద్భుతం. అలాంటి సినిమా యొక్క టైటిల్ ను మా సినిమాకు పెట్టి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు.

మా ఖుషి సినిమా చూసిన తర్వాత తప్పకుండా పవన్‌ కళ్యాణ్ గారి అభిమానులు గర్విస్తారు. మరో మంచి ఖుషి సినిమా ను చూశాం అంటూ వారు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు అన్నట్లుగా విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సమంత మరియు విజయ్ దేవరకొండల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా లో బాగుంటుందని మేకర్స్ అంటున్నారు. లైగర్‌ విడుదల అయిన తర్వాత ఖుషి కి సంబంధించిన హంగామా మొదలయ్యే అవకాశం ఉంది.