Begin typing your search above and press return to search.

లేడీ డైరెక్టర్‌ తో సినిమాకు ఇంట్రెస్ట్‌ గా ఉన్న రౌడీ స్టార్‌

By:  Tupaki Desk   |   17 Nov 2020 11:45 AM IST
లేడీ డైరెక్టర్‌ తో సినిమాకు ఇంట్రెస్ట్‌ గా ఉన్న రౌడీ స్టార్‌
X
సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారై పోట్రూ సినిమాకు మంచి ఆధరణ లభించింది. ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్స్‌ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ టాలీవుడ్‌ వరకు పలువురు సూర్య మరియు సుధాలను ప్రశంసించారు. తాజాగా ఆ జాబితాలో విజయ్‌ దేవరకొండ నిలిచాడు. ఆకాశమే నీ హద్దురా సినిమా పై విజయ్‌ వరుస ట్వీట్స్‌ తో ప్రసంసలు కురిపించారు.

విజయ్‌ ట్విట్టర్‌ లో.. సినిమాను నేను పెద్ద గ్యాంగ్‌ తో చూశాను. అందులో ముగ్గురు మాత్రం ఎమోషనల్‌ గా కనెక్ట్‌ అయ్యి ఏకంగా ఏడ్చేశారు. సినిమా చూసిన తర్వాత తెలియని ఆవేశం ఒకటి కలుగుతుంది. సినిమా మంచి సందేశాన్ని ఇచ్చింది. సూర్య అద్బుతమైన నటన కనబర్చారు. ఆయన నటన చూసిన తర్వాత ప్రేమలో పడాల్సిందే. హీరోయిన్‌ అపర్ణ ను చూసి ఇలాంటి అద్బుతమైన నటిని సుధ గారు ఎక్కడ పట్టారు అనిపించింది. దర్శకురాలు సుధ కొంగర పై ప్రశంసలు చేస్తూ నేను మీతో కలిసి పని చేస్తాను. దర్శకురాలిగా మీ ప్రతిభకు ఇది నా ప్రపోజల్‌. జీవీ ప్రకాష్‌ సంగీతం చాలా బాగుంది. సినిమాలో నిజం ఎంత అబద్దం ఎంత అనేది నాకు తెలియదు. కాని అందరు చూడాల్సిన సినిమా ఇది అంటూ రౌడీ ట్వీట్‌ చేశాడు.