Begin typing your search above and press return to search.

వీడియో: కండ‌లు పెంచిన రౌడీ బాహుబ‌ల భుజ‌బ‌ల ప్ర‌ద‌ర్శ‌న

By:  Tupaki Desk   |   23 March 2021 4:43 AM GMT
వీడియో: కండ‌లు పెంచిన రౌడీ బాహుబ‌ల భుజ‌బ‌ల ప్ర‌ద‌ర్శ‌న
X
కండ‌లు పెంచడం ఒకెత్తు .. ప్ర‌ద‌ర్శించ‌డం మ‌రో ఎత్తు. ఆ రెండిటినీ స‌జావుగా న‌డిపించేస్తున్నాడు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం అత‌డు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ కోసం అత‌డు త‌న రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. బాక్సింగ్ మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యం కాబ‌ట్టి అన్ని విద్య‌ల్లోనూ ఆరితేరాడు. దానికోసం శిక్ష‌ణ తీసుకున్నాడు. పూరి త‌న ఇత‌ర హీరోల్లానే రౌడీ రూపాన్ని పూర్తిగా మార్చేసార‌న‌‌డానికి ఇదిగో ఇదే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.

తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ షాక్ కి గురి చేసింది. అత‌డు విమానాశ్ర‌యం లో ఫోన్ మాట్లాడుతూ వెళుతుంటే జ‌నం నోరెళ్ల‌బెట్టి క‌ళ్ల‌ప్ప‌గించి మ‌రీ అటువైపు చూస్తున్నారు. అంత‌గా అత‌డి లుక్ మొత్తం మారిపోయింది. టింగు రంగ‌డిలా అదిరిపోయే ఫ్యాష‌నబుల్ డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించాడు రౌడీ. అత‌డితో పాటు ఆ స‌మ‌యంలో సహాయ‌కుడు కూడా ఉన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి నుంచి రౌడీ వేర్ బ్రాండ్స్ తో దుమారం రేపుతున్నాడు. బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ లా టాలీవుడ్ లో అత‌డు స్టైల్ అన్న ప‌దానికి చిరునామాగా మారాడు. ఇక్క‌డ స్టైలిష్ స్టార్ బ‌న్నీకే అత‌డు రౌడీ బ్రాండ్ దుస్తుల్ని స‌ర‌ఫ‌రా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌పోతే లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ విల‌క్ష‌ణ‌మైన బాక్స‌ర్ గా మార్ష‌ల్ ఆర్ట్స్ ప్లేయ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. కండ‌లు పెంచి 6ప్యాక్ ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నాడు. అలాగే త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు పొడ‌వాటి గిర‌జాల జుత్తుతో మ‌తులు చెడ‌గొట్ట‌బోతున్నాడ‌ని మారిన అత‌డి రూపం చెబుతోంది. కండ‌లు పెంచిన రౌడీ బాహుబ‌ల భుజ‌బ‌ల ప్ర‌ద‌ర్శ‌న బావుంది! అంటూ తాజా గెట‌ప్ కి కామెంట్లు వినిపిస్తున్నాయి.

లైగ‌ర్ పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి. తొలి గ్లింప్స్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. మునుముందు ఈ సినిమా ప్ర‌మోష‌న్ ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు దేవ‌ర‌కొండ చేయాల్సిందంతా చేయ‌నున్నార‌ని తెలిసింది‌. ఇక ఈ చిత్రానికి పూరి-ఛార్మి బృందంతో క‌లిసి క‌ర‌ణ్ జోహార్ పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళం స‌హా హిందీలోనూ లైగ‌ర్ భారీగా రిలీజ్ కానుంది.