Begin typing your search above and press return to search.

పిక్ టాక్: డేట్ కు వెళ్లిన గీత గోవిందం

By:  Tupaki Desk   |   26 March 2021 5:05 AM GMT
పిక్ టాక్: డేట్ కు వెళ్లిన గీత గోవిందం
X
గీత గోవిందం.. డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించి హిట్ పెయిర్ గా నిలిచిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు రష్మీక మందన్నా లు ప్రేమలో ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా ఒట్టి పుకార్లే అని ఇద్దరు కూడా తేల్చేశారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా వారి వారి సినిమాల షూటింగ్ నిమిత్తం ముంబై లో ఉన్నారు. ఇటీవల ఇద్దరు కలిశారు.

కాస్త గ్యాప్ తర్వాత కలిసిన వీరిద్దరూ డేట్ కు వెళ్లారట. అందుకు సంబంధించిన ఫోటో ఇది. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కనిపించగా రష్మీక ఎప్పటి లాగే చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటో లో రష్మీక తెల్లని పూలు చేతిలో పట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణ గా చెప్పుకోవచ్చు. ముంబై లో డేట్ కు వెళ్లిన ఈ స్నేహితులు అక్కడి ఫోటోగ్రాఫర్స్ కెమెరా కంట పడ్డారు. ఈ జంటను అభిమానించే వారు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మళ్ళీ వీరి కాంబోలో సినిమా కావాలని వారు కోరుకుంటున్నారు.