Begin typing your search above and press return to search.

దళపతి స్పీడ్.. చూసి నేర్చుకోండి!

By:  Tupaki Desk   |   4 Jan 2023 10:00 PM IST
దళపతి స్పీడ్.. చూసి నేర్చుకోండి!
X
ఇటీవల కాలంలో చాలా మంది అగ్ర హీరోలు ఒక సినిమా విడుదల చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నారు అనే చెప్పాలి. ఐదేళ్ల ముందు వరకు కూడా కొంతమంది అగ్ర హీరోలు ఏడాదికి ఒక సినిమా తప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ గ్యాప్ మరింత పెరిగిపోతుంది. రెండు మూడేళ్లకు ఒక్క సినిమా అనే విధంగా కూడా మరి కొంతమంది హీరోలు ఆలోచిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఒక విధంగా మార్కెట్ స్థాయి పెరగడం అలాగే సినిమా స్పాన్ ఫ్యాన్ ఇండియా రేంజ్ కు వెళ్లడం కూడా అందుకు కారణాలు అయ్యి ఉండవచ్చు. అయితే 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న విజయ్ మాత్రం ఒక సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే వెంటనే మరొక సినిమాను అతను మొదలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

ఏడాదికి ఒక సినిమా అనే విధంగా అతను ముందుకు సాగుతున్నాడు. వీలైతే రెండు చేయాలని అనుకుంటున్నాడు.

కరోనాలో కూడా అతను ఎక్కువగా గ్యాప్ ఇవ్వాలని అనుకోలేదు. ఇక ఇటీవల విజయ్ 67వ సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. ఇంకా వారసుడు సినిమా ధియేటర్లోకి రాలేదు. ఆ సినిమా సెన్సార్ పనుల్లో బిజీగా ఉండగానే లోకేష్ కనగరాజ్ తో విజయ్ 67వ సినిమా కు సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టేసాడు.

ఒక విధంగా ఈ హీరోని చూసి మిగతా హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి అని ఓవర్గం ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.