Begin typing your search above and press return to search.
సెల్ఫీతో సూపర్ స్టార్ బల నిరూపణ
By: Tupaki Desk | 11 Feb 2020 9:24 PM ISTతమిళ సూపర్ స్టార్ విజయ్ ఈమద్య కాలంలో చాలా ఎక్కువగా మీడియాలో ఉంటున్నాడు. ఈయన్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అనేక విధాలుగా విజయ్ ను టార్గెట్ చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులు మరియు ఇతరత్ర విషయాలతో విజయ్ మనసు కూడా నొచ్చుకున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఇటీవల నైవేలీలో మాస్టర్ షూటింగ్ లో ఉండగా ఐటీ అధికారులు షూటింగ్ ను మద్యలో ఆపేసి వారి కారులో ఎక్కించుకు తీసుకు వెళ్లారు. విచారణ పేరుతో చాలా సమయం వృదా చేశారు. తన కారులో వస్తానంటూ చెప్పినా కూడా వినిపించుకోలేదట. దాంతో పాటు విజయ్ షూటింగ్ స్పాట్ కు బీజేపీ కార్యకర్తలు కొందరు వెళ్లి బొగ్గు గనుల్లో ఎలా షూట్ చేస్తారు.. ఇందుకు ఎవరు అనుమతించారు అంటూ ఆందోళన చేసి షూటింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఇలా గత కొన్ని రోజులుగా బీజేపీ తనను టార్గెట్ చేయడంతో విజయ్ ఈ సెల్ఫీ తో బదులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తనకున్న అభిమాన గణంను ప్రదర్శిస్తూ వీరు నాతో ఉండగా మీరు ఏమీ చేయలేరు అంటూ విజయ్ సెల్ఫీ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మాస్టర్ షూటింగ్ స్పాట్ లోకి బీజేపీ నాయకులు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారనే విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు కొన్ని గంటల వ్యవధిలో అక్కడకు భారీ ఎత్తున చేరుకున్నారు.
షూటింగ్ స్పాట్ కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో ఎప్పుడు లేనిది మొదటి సారి విజయ్ వారితో సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల్లోనే తనకోసం ఇంత మంది అభిమానులు వచ్చారు అని చెప్పుకునేందుకు విజయ్ ఈ సెల్ఫీని పోస్ట్ చేశాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు విజయ్ ని టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఈ సెల్ఫీతో సమాధానం ఇచ్చాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.