Begin typing your search above and press return to search.

దళపతి బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ లుక్ - టైటిల్ అనౌన్స్ మెంట్!

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 AM GMT
దళపతి బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ లుక్ - టైటిల్ అనౌన్స్ మెంట్!
X
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ కలిగిన హీరో ఇళయదళపతి విజయ్ అనే చెప్పాలి. దళపతి విజయ్ సినిమా వస్తుంది అంటేనే తమిళనాడు మొత్తం ఊగిపోతోంది. ప్రస్తుతం ఆ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విజయ్. మాములుగా విజయ్ సినిమా వస్తుందంటేనే అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తారు అలాంటిది తమ స్టార్ హీరో పుట్టినరోజు వేడుకలు ఏ రేంజ్ లో చేస్తారో ఊహకే అందట్లేదు.. అయితే ఈ నెల 22న ఇళయదళపతి విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతూ.. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

అయితే ఈ వేడుకలు కేవలం పుట్టినరోజు గురించి మాత్రమే కాదు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న దళపతి65 సినిమా గురించి కూడా. ఎందుకంటే విజయ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ కూడా ప్రకటించారు. ఇంకా విజయ్ బర్త్ డేకు 4రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఫ్యాన్స్ లో ఆ ఉత్సాహం మనం చూడవచ్చు. ప్రస్తుతం దళపతి 65వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజిలో ప్లాన్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో విజయ్ సరసన ఫస్ట్ టైమ్ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే అందరూ ఊహించినట్లుగా దళపతి 65 మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేస్తారని ఎక్సపెక్ట్ చేశారు. కానీ మేకర్స్ ఒకరోజు ముందు నుండే సందడి మొదలయ్యేలా జూన్ 21న సాయంత్రం 6గంటలకు దళపతి65 ఫస్ట్ లుక్.. టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ ఏడాది విజయ్ 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్బంగా విడుదల చేసే దళపతి 65 పోస్టర్ ట్విట్టర్ లో దుమ్మురేపనుందని.. రికార్డులు కూడా బద్దలుకొడతాం అంటూ విజయ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిజంగానే విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇక విజయ్ కి తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఎక్సపెక్టషన్స్ మాత్రం భారీగానే నెలకొన్నాయి. చూడాలి ఎలాంటి టైటిల్ తో రానున్నాడో..!