Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి 'బిగిల్' ఓవ‌ర్సీస్ స్కైలో

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:14 AM GMT
ద‌ళ‌ప‌తి బిగిల్ ఓవ‌ర్సీస్ స్కైలో
X
ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా అట్లీ తెర‌కెక్కిస్తున్న బిగిల్ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ మూడు గెట‌ప్పుల్లో ద‌ర్శ‌న‌మిచ్చి అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. మాస్ నాయ‌కుడిగా .. కార్పొరెట్ గ‌య్ లా.. ఫుట్ బాల్ కోచ్ గా మూడు విభిన్న‌మైన వేషాల్లో క‌నిపించి బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో న‌య‌న‌తార ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం... బిగిల్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ త‌ర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఊపొచ్చింద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ బిజినెస్ పెద్ద రేంజులోనే ఓపెన్ అయ్యింద‌ట‌. అక్క‌డ ప్ర‌ముఖ పంపిణీ సంస్థ 30 కోట్ల‌కు హ‌క్కుల్ని ద‌క్కించుకుంద‌ని కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. విజ‌య్ సినిమా అంటే 100 నుంచి 150 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుంటుంది. ఒక్క త‌మిళ‌నాడులోనే 100 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఇక ఓవ‌ర్సీస్ లోనూ విజ‌య్ రేంజు అంత‌కంత‌కు పెరుగుతోంది. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్ లో తేరి - మెర్స‌ల్ దేశ విదేశాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఓవ‌ర్సీస్ లోనూ ఫ‌ర్వాలేద‌నిపించాయి. అందుకే ఈసారి బిగిల్ కి బిజినెస్ ప‌రంగా హైప్ వచ్చింద‌ని తెలుస్తోంది.

అలాగే బిగిల్ చిత్ర క‌థాంశం క్రీడా నేప‌థ్యం కావ‌డంతో ఓవ‌ర్సీస్ లో ప్ర‌త్యేకించి ఆస‌క్తి నెల‌కొంద‌ని చెబుతున్నారు. ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ పాత్ర‌లో విజ‌య్ స‌రికొత్త ఆహార్యం చూపించ‌బోతున్నార‌ట‌. మెర్స‌ల్ బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్లు వ‌సూళ్ల‌తో సంచ‌లనం సృష్టించింది. ప్ర‌స్తుతం బిగిల్ బిజినెస్ హైప్ చూస్తుంటే అంత‌కుమించి వ‌సూలు చేయాల్సి ఉంటుందేమో?