Begin typing your search above and press return to search.

విదేశాలలో విడుదలకు సిద్ధమవుతున్న దళపతి 'బిగిల్'

By:  Tupaki Desk   |   19 Jun 2020 1:30 AM GMT
విదేశాలలో విడుదలకు సిద్ధమవుతున్న దళపతి బిగిల్
X
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ - అట్లీ కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ సినిమా 'బిగిల్'. గతేడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అట్లీ - విజయ్ తో మూడో ప్రయత్నంగా మహిళల ప్రాధాన్యత గురించి సబ్జెక్టు ఎంచుకొని ఈ సినిమా రూపొందించాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే తేరి(పోలీసోడు).. మెర్సల్(అదిరింది) సినిమాలు భారీ విజయాలు నమోదు చేయడంతో బిగిల్(విజిల్) సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఎమోషనల్ సందేశాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్స్ లో మెప్పించాడు. అయితే గతేడాది దీపావళికే విడుదలైన ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారట. అవును నిజమే.. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా థియేటర్లు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే.

సినిమా థియేటర్లను తెరిచే పరిస్థితులలో ప్రభుత్వాలు కూడా లేవు. పరిమిత సీట్ల విధానంతో థియేటర్లు ప్రారంభించాలనే ప్రతిపాదన ఉన్నా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇప్పటికే నష్టాలలో ఉన్న థియేటర్లలో ఇంకా శానిటైజేషన్ చేయడానికి సిద్దంగా లేమని అంటున్నారు. కానీ మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం అన్నీ నిబంధనలకు సై అంటున్నాయి. ఈ పరిస్థితులు ఎప్పుడు సర్దుమణుగుతాయో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా విదేశాలలో థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే అక్షయ్ కుమార్ 'గుడ్ న్యూస్' సినిమా దుబాయ్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే బాటలో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా 'బిగిల్'తో థియేటర్లు పునః ప్రారంభం చేయబోతున్నారు. ఇక బిగిల్ సినిమా జూన్ 22న ఫ్రాన్స్ లో, జూన్ 30న జర్మనీలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టైమింగ్స్.. స్క్రీన్స్ లిస్ట్ డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేశారట.