Begin typing your search above and press return to search.

హీరోయిన్ థైస్ గురించి ఆరెక్స్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   5 Aug 2018 6:55 AM GMT
హీరోయిన్ థైస్ గురించి ఆరెక్స్ డైరెక్టర్
X
రామ్ గోపాల్ వర్మ శిష్యులు టేకింగ్ లోనే కాదు మాట తీరులోనూ ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆరెక్స్ 100 ద్వారా తన మొదటి సినిమాతోనే రొరింగ్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి దాని దెబ్బకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. తన కొత్త సినిమా ఎవరితో అనే వివరాలు ఇంకా బయటికి రానప్పటికీ పెద్ద బ్యానర్ లో అందులోనూ ఓ క్రేజీ హీరోతో అది పట్టాలెక్కబోతోందని వినికిడి. ఇటీవలే యాంకర్ రష్మీ నటించిన అంతకు మించి అనే మూవీ ట్రైలర్ లాంచ్ కు అటెండ్ అయిన అజయ్ భూపతి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓసారి నాంపల్లి మీదుగా వెళ్తున్నప్పుడు తన ఆరెక్స్ 100 హోర్డింగ్ చూసుకుంటూ వెళ్లేవాడినని కొద్దిరోజులు దాని పక్కన వేరే ఏ సినిమా పోస్టర్ కనిపించలేదని ఓ సారి సడన్ గా అంతకు మించి పేరుతో రష్మీ థైస్ ని హై లైట్ చేస్తూ సముద్ర తీరం వైపు డిజైన్ చేసిన విజువల్ తనను బాగా ఆకట్టుకుందని ఓపెన్ అయిపోయాడు.

ఇది చూసాక పక్కన తన ఆరెక్స్ 100 పోస్టర్ ఉందనే విషయం కూడా మర్చిపోయాడట అజయ్. మొత్తానికి తన సినిమాలో లేని హీరోయిన్ థైస్ గురించి ఓ దర్శకుడు ఇంత ఓపెన్ గా మాట్లాడటం విశేషం. అజయ్ భూపతి వర్మ శిష్యుడే అయినప్పటికీ బోల్డ్ గా మాట్లాడుతూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. వర్మను దర్శకుడిగా గౌరవిస్తాను కానీ వ్యక్తిగా ఆయనంటే ఏ మాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన అజయ్ భూపతి ఇప్పుడు ఈ కామెంట్స్ ద్వారా మరోసారి చర్చలోకి వచ్చాడు. హారర్ జానర్ లో రూపొందిన అంతకు మించి గురించి చెబుతూ సౌండ్ షాట్ డివిజన్ చాలా కీలకంగా ఉండే ఇలాంటి సినిమాల ద్వారా మెప్పించడం అంత సులభం కాదని ఈ విషయంలో దర్శకుడు సునీల్ కశ్యప్ ని ప్రత్యేకంగా అభినందించాడు అజయ్ భూపతి. ఈయన చెప్పడం అని కాదు కానీ రష్మీ సైతం తన తొడలు తప్ప యాక్టింగ్ ని సీరియస్ గా ఎవడూ చూడటం లేదని చెప్పడం కొసమెరుపు.